Green Fungus : దేశంలో మరో కొత్త రకం ఫంగస్.. ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం

అసలే ఉన్న ఫంగస్ లతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. దేశంలో మరో కొత్త ఫంగస్ వెలుగులోకి వచ్చింది. అదే గ్రీన్ ఫంగస్.

Green Fungus : దేశంలో మరో కొత్త రకం ఫంగస్.. ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం

Green Fungus

Green Fungus : అసలే ఉన్న ఫంగస్ లతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే.. దేశంలో మరో కొత్త ఫంగస్ వెలుగులోకి వచ్చింది. అదే గ్రీన్ ఫంగస్. మధ్యప్రదేశ్‌లో కరోనా నుంచి కోలుకున్న ఓ వ్యక్తికి గ్రీన్‌ ఫంగస్‌ సోకినట్లు డాక్టర్లు గుర్తించారు. దేశంలో ఇదే మొదటి గ్రీన్‌ ఫంగస్‌ కేసు అని వెల్లడించారు. ఈ కొత్త రకం ఫంగస్‌ ఆస్పెర్‌ గిలోసిస్‌ ఇన్ఫెక్షన్‌ అని శ్రీ అరబిందో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్‌ సైన్సెస్‌కు (ఎస్‌ఏఐఎంఎస్‌) చెందిన డాక్టర్‌ రవి దోసి తెలిపారు. దీనిపై మరిన్ని పరిశోధనలు అవసరమన్నారు. ఆస్పర్‌గిలోసిస్‌ ఇన్ఫెక్షన్‌ ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన తెలిపారు.

తాజాగా గ్రీన్‌ ఫంగస్‌ సోకిన 34 ఏళ్ల వ్యక్తి రెండు నెలల కిందట కరోనా నుంచి కోలుకున్నాడు. 15 రోజుల నుంచి ముక్కు నుంచి తీవ్ర రక్తస్రావం, జ్వరం రావడంతో బ్లాక్‌ ఫంగస్‌ సోకిందేమోనన్న అనుమానంతో డాక్టర్లను సంప్రదించారు. వివిధ పరీక్షల తర్వాత అతడికి గ్రీన్‌ ఫంగస్‌ సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో అతడి ఊపిరితిత్తులు, రక్తం, సైనస్‌లపై తీవ్ర ప్రభావం పడిందని తెలిపారు. బ్లాక్‌ ఫంగస్‌కు గ్రీన్‌ ఫంగస్‌కు వేర్వేరు ఔషధాలు ఉంటాయని డాక్టర్‌ రవి దోసి తెలిపారు. చికిత్స కోసం బాధితుడిని ఎయిర్‌ అంబులెన్సు ద్వారా ముంబైకి తరలించారు.

దేశంలో మొదట బ్లాక్‌ ఫంగస్‌ను గుర్తించారు. పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత వైట్‌‌, ఎల్లో ఫంగస్‌ కేసులు వెలుగుచూశాయి. అయితే వాటి సంఖ్య చాలా తక్కువ. ఇప్పుడు కొత్తగా వెలుగుచూసిన గ్రీన్ ఫంగస్.. కరోనా రోగులను ఆందోళనకు గురి చేస్తోంది.