Grenade Attack : బారాముల్లాలో భద్రతా సిబ్బందిపై గ్రనేడ్ దాడి

జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా పట్టణంలోని కాన్పొరా బ్రిడ్జికి దగ్గర్లో శుక్రవారం మధ్యాహ్నాం భద్రతా సిబ్బందిపై గ్రెనైడ్‌ దాడి జరిగింది.

10TV Telugu News

Grenade Attack జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా పట్టణంలోని కాన్పొరా బ్రిడ్జికి దగ్గర్లో శుక్రవారం మధ్యాహ్నాం భద్రతా సిబ్బందిపై గ్రెనైడ్‌ దాడి జరిగింది. మిలిటెంట్లు గ్రనైడ్‌ విసరడంతో నలుగురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లతో పాటుగా ఓ పౌరుడికి గాయాలయ్యాయి. గాయపడినవారిని వెంటనే ట్రీట్మెంట్ కోసం స్థానిక హాస్పిటల్ కు తరలించారు. అయితే దుండగులను పట్టుకునేందుకు ఘటన జరిగిన ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకొని తనిఖీ చేస్తున్నారు భద్రతా సిబ్బంది.

కాగా, గడిచిన కొద్ది రోజుల్లో బారాముల్లా ప్రాంతంలో భద్రతా సిబ్బందిపై జరిగిన రెండో గ్రనేడ్ దాడి ఇది. జమ్మూకశ్మీర్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లపై ఇవాళ ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ కుమార్‌ మెహతా అధ్యక్షత సమీక్ష సమావేశం జరగాల్సి ఉండగా ఈ దాడి జరగడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఉదయం జమ్మూకశ్మీర్‌లోని సాంబా జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో మూడు డ్రోన్లను జమ్మూకశ్మీర్‌ పోలీసులు గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందించిన విషయం తెలిసిందే.