Baarat Late: బారాత్ డ్యాన్స్‌తో లేట్ చేస్తున్నాడని మరొకరిని పెళ్లాడిన వధువు

రాజస్థాన్ లోని చురు జిల్లాలో బారాత్ లేట్ చేస్తున్నాడని ఆ వరుడిని కాదని మరో వ్యక్తిని పెళ్లాడింది వధువు. రాజఘడ్ తహసీల్ పరిధిలోని చెలానా గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఆదివారం మే 15న సునీల్ పెళ్లికొడుకు బంధువులతో సహా పెళ్లికూతురు గ్రామానికి వచ్చారు.

Baarat Late: బారాత్ డ్యాన్స్‌తో లేట్ చేస్తున్నాడని మరొకరిని పెళ్లాడిన వధువు

Bride Groom

Baarat Late: రాజస్థాన్ లోని చురు జిల్లాలో బారాత్ లేట్ చేస్తున్నాడని ఆ వరుడిని కాదని మరో వ్యక్తిని పెళ్లాడింది వధువు. రాజఘడ్ తహసీల్ పరిధిలోని చెలానా గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఆదివారం మే 15న సునీల్ పెళ్లికొడుకు బంధువులతో సహా పెళ్లికూతురు గ్రామానికి వచ్చారు.

బారాత్ డ్యాన్స్ కార్యక్రమం రాత్రి 9గంటలకు ఏర్పాటు చేశారు. వరుడి స్నేహితులు మద్యం తీసుకుని డీజే బీట్లలో మునిగిపోయారు. గంటల పాటు అదే డీజే మోతల్లో ఎంజాయ్ చేస్తూ అర్ధరాత్రి ఒంటి గంట 15నిమిషాలకు ఉన్న ముహూర్తాన్ని కూడా మర్చిపోయారు.

పెళ్లి కోసం డీజే డ్యాన్సులు తగ్గించకపోగా.. మద్యం తీసుకుని వేస్తున్న డ్యాన్స్ ఆపాలని వధువు తరపు బంధువులు చెప్పినా వినిపించుకోలేదు. వరుడు బారాత్ నుంచి తిరిగి వస్తాడని ఎదురుచూసి విసిగిపోయిన వధువు తరపు వ్యక్తులు వేరొకరితో వివాహం జరిపించాలని నిర్ణయించారు.

Read Also: బారాత్ లో డ్యాన్స్ చేస్తూ వరుడు మృతి

ఘటన జరిగిన మరుసటి రోజు పెళ్లికొడుకు కుటుంబం పోలీస్ స్టేషన్ కు వెళ్లి వధువు కుటుంబంపై కంప్లైంట్ చేశారు. వధువు తరపు వ్యక్తులు పెళ్లితంతును లెక్కచేయలేదని భవిష్యత్ లో ఇటువంటి ప్రవర్తన చాలా ఇబ్బందులు తీసుకొస్తుందని హెచ్చరించారు. ఇరు కుటుంబాలకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి.. వెడ్డింగ్ క్యాన్సిలేషన్ కుటుంబాల మధ్య మనస్పర్ధల కారణంగానే జరిగిందని తేల్చారు.