పోలింగ్ ఎట్రాక్షన్ : పెళ్లి దుస్తుల్లో ఓటు వేసిన వరుడు

యూపీలోని లోక్ సభ ఎన్నికల పోలింగ్ లో ఓ యువకుడు పెళ్లికొడుకు గెటప్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

  • Published By: sreehari ,Published On : April 11, 2019 / 01:59 PM IST
పోలింగ్ ఎట్రాక్షన్ : పెళ్లి దుస్తుల్లో ఓటు వేసిన వరుడు

యూపీలోని లోక్ సభ ఎన్నికల పోలింగ్ లో ఓ యువకుడు పెళ్లికొడుకు గెటప్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

యూపీలోని లోక్ సభ ఎన్నికల పోలింగ్ లో ఓ యువకుడు పెళ్లికొడుకు గెటప్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. వింతైన వేషధారణలో పోలింగ్ బూత్ కు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నాడు. మెడలో డబ్బుల దండ, ష్యూట్, తలపాగా ధరించి బిజ్ నూర్ పోలింగ్ స్టేషన్ దగ్గర అందరిని ఆకట్టుకున్నాడు. పోలింగ్ స్టేషన్ బయట సెక్యూరిటీ గార్డు పక్కన నిలబడిన పెళ్లికొడుకు.. తాను ఓటు వేసిన వేలుపై సిరాను చూపిస్తూ ఫొటోలకు ఫొజులిచ్చాడు. ఈ ఫొటోలను న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ట్విట్టర్ లో పోస్టు చేయడంతో వైరల్ గా మారాయి. 

బాధ్యతగా అందరూ ఓటు వేయాలని సంకేతాన్ని ఇచ్చేలా పెళ్లికొడుకు ఓటు వేయడాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. దేశవ్యాప్తంగా లోక్ సభ తొలి దశ ఎన్నికలు మొత్తం 91 పార్లమెంటరీ నియోజవర్గాల్లో జరిగాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ స్టేషన్లకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్ లో మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ 51 శాతం నమోదైంది.