UP bulldozer baraat: యోగి ఇలాకాలో.. ముస్లిం జంట వివాహంలో ‘బుల్డోజర్ బరాత్’..
దేశవ్యాప్తంగా ప్రముఖంగా వినిపిస్తున్న పదం ‘బుల్డోజర్’. ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో 'బుల్డోజర్' అనే మాట ప్రతిరోజూ వినిపిస్తుంది. రాష్ట్రంలో యోగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత బుల్డోజర్ కు ప్రాధాన్యత ఏర్పడింది. అక్రమ కట్టడాలను కూల్చివేయడంలో బుల్డోజర్ ను వినియోగిస్తూ అక్రమార్కుల గుండెల్లో యోగి రైళ్లు పరుగెత్తిస్తున్నారు. అయితే నేరస్థుల ఇళ్లను ప్రభుత్వాలు కూల్చేయడానికే పరిమితం అనుకుంటే పొరపాటే..

UP bulldozer baraat: దేశవ్యాప్తంగా ప్రస్తుతం ప్రముఖంగా వినిపిస్తున్న పదం ‘బుల్డోజర్’. ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో ‘బుల్డోజర్’ అనే మాట ప్రతిరోజూ వినిపిస్తుంది. రాష్ట్రంలో యోగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత బుల్డోజర్ కు ప్రాధాన్యత ఏర్పడింది. అక్రమ కట్టడాలను కూల్చివేయడంలో బుల్డోజర్ ను వినియోగిస్తూ అక్రమార్కుల గుండెల్లో యోగి రైళ్లు పరుగెత్తిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ మళ్లీ ఆ రాష్ట్రంలో బీజేపీ విజయం సాధించడంతో సీఎంగా యోగి బాధ్యతలు చేపట్టారు. దీంతో బీజేపీ బుల్డోజర్ అనే పదాన్ని దేశవ్యాప్తంగా ఉపయోగిస్తుంది.
Viral Video: అదృష్టవంతులు.. మ్యాన్‌హోల్‌లో పడిపోయిన జంట.. వీడియో వైరల్
అయితే నేరస్థుల ఇళ్లను ప్రభుత్వాలు కూల్చేయడానికే పరిమితం అనుకుంటే పొరపాటే.. ఓ ముస్లిం జంట వివాహ వేడుకలోనూ బుల్డోజర్ కనిపించింది. శనివారం బహ్రాయీచ్ జిల్లాలో ఈ వినూత్న వేడుక జరిగింది. బాద్షా-రుబీనా వివాహం ఘనంగా జరిగింది. అయితే పెళ్లి బరాత్‌లో బుల్డోజర్ను ఉపయోగించి అందరినీ ఆశ్చర్య పర్చారు. బాద్షాను కుటుంబ సభ్యులు అందంగా అలంకరించిన బుల్డోజర్పై ఊరేగించారు. దీన్ని చూసి స్థానికులు ‘బుల్డోజర్ బాబాకీ జై’అంటూ నినాదాలు చేశారు. దీంతో గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే .. ‘బుల్డోజర్ బారాత్’ లక్ష్మణ్‌పూర్-శంకర్‌పూర్ గ్రామానికి వచ్చినప్పుడు, దాదాపు గ్రామం మొత్తం సెల్ఫీ తీసుకోవడానికి వేదిక వద్దకు పరుగెత్తారు. వరుడితో కాదు.. అతను వచ్చిన అలంకరించిన బుల్‌డోజర్‌తో సెల్పీలు దిగారు.
PM Modi: మంచి పనులకు రాజకీయ రంగు పులుముకోవడం మన దేశ దురదృష్టం
ఈ విషయంపై పెళ్లి పెద్దలు మాట్లాడుతూ.. బాద్షా-రుబీనా వివాహాన్ని గుర్తుండిపోయేలా చేసేందుకు ఇలా బుల్డోజర్ను ఉపయోగించినట్లు తెలిపారు. ఇదిలాఉంటే ఈ ఘటనపై బహ్రాయీచ్ సదర్ నియోజకవర్గ ఎమ్మెల్యే, బీజేపీ నేత అనుపమా జయస్వాల్ స్పందించారు. రాష్ట్రంలో సుపరిపాలనకు బుల్డోజర్ చిహ్నంలా మారిందని పేర్కొన్నారు. బుల్డోజర్ను చూసి నేరస్థులే భయపడుతున్నారని అన్నారు. పెళ్లి కొడుకు ఈ విషయంపై మాట్లాడుతూ.. నేను నా వివాహాన్ని ఒక చిరస్మరణీయ సంఘటనగా మార్చాలనుకున్నా, ఈ ఆలోచన కూడా భిన్నంగా ఉంటుందని నేను అనుకున్నానని చెప్పాడు. ఇప్పుడు బుల్డోజర్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- Uttar Pradesh: యోగి హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. క్షణాల్లో అప్రమత్తమైన అధికారులు
- Viral video: తన్నుకున్న టీచర్లు.. విద్యార్థులు ఏం చేశారంటే..! వీడియో వైరల్
- Uttar Pradesh: తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపిన పెళ్లికొడుకు.. ఒకరి మృతి.. వీడియో
- Ayodhya Kissing Wife : అయ్యో పాపం.. నదిలో భార్యకు ముద్దుపెట్టిన భర్తను ఉతికారేసిన జనం.. వీడియో వైరల్
- Varanasi : వారణాశి నుంచి చెన్నైకి రేపు ప్రత్యేక రైలు-ఒక్కరోజు మాత్రమే
1Helicopter Services: లదాఖ్ ప్రాంతంలో అందుబాటులోకి హెలికాప్టర్ సేవలు
2Mahesh Babu : బిల్‌గేట్స్ తో మహేష్ మంతనాలు.. వైరల్ గా మారిన ఫొటో
3Chiranjeevi : ప్రధాని మోదీతో వేదికని పంచుకోబోతున్న చిరంజీవి
4Trains Cancelled: బల్లార్షా నుంచి సికింద్రాబాద్‌కు మధ్య రైళ్ల సర్వీసులు రద్దు
5AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అమరావతి రైతులకు ఊరట..
6GST: పెరగనున్న హోటల్ రూమ్ ఛార్జీలు.. కొత్త జీఎస్టీ వివరాలు ఇవే
7Dil Raju : 50 ఏళ్ళ వయసులో తండ్రి అయిన దిల్‌రాజు.. పండంటి బాబుకి జన్మనిచ్చిన దిల్‌రాజు వైఫ్..
8Covid Cases: భారత్‌లో లక్షకు చేరువవుతున్న కరోనా కేసులు
9Maharashtra political crisis: మహా’సంక్షోభం’లో కీలక మలుపు.. బలనిరూపణ చేసుకోవాలని ఉద్ధవ్‌కు గవర్నర్ ఆదేశం.. రేపు సాయంత్రం వరకు డెడ్ లైన్..
10Poojahegde : బాలీవుడ్ లో నేను చేసిన చెత్త సినిమా అది.. దానివల్ల నాకు ఆఫర్స్ రాలేదు..
-
Period Tracking Apps : అమెరికాలో మహిళలు.. ఫోన్లలో పీరియడ్ ట్రాకింగ్ యాప్స్ డిలీట్ చేస్తున్నారు.. ఎందుకంటే?
-
Moto G42 India : మోటో G42 లాంచ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
-
Google Hangouts : వచ్చే నవంబర్‌లో హ్యాంగౌట్స్ షట్‌డౌన్.. గూగుల్ చాట్‌కు మారిపోండి..!
-
Pakka Commercial: పక్కా కమర్షియల్ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే?
-
Lokesh Kanagaraj: విజయ్ కోసం మకాం అక్కడికి మారుస్తున్న లోకేశ్..?
-
Tesla Employees : టెస్లా ఉద్యోగుల కష్టాలు.. ఆఫీసుకు రావాల్సిందే.. వస్తే కూర్చొనేందుకు కుర్చీలు కూడా లేవట..!
-
Loan Apps : లోన్ యాప్స్ కేసుల్లో కొత్త కోణం..అడగకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ
-
Train Crash : అమెరికాలో ఘోర రైలు ప్రమాదం..ముగ్గురి మృతి