కాబోయే భార్య కోసం మంచు వర్షంలో 4 కిలోమీటర్లు నడక

  • Published By: madhu ,Published On : January 31, 2020 / 01:04 AM IST
కాబోయే భార్య కోసం మంచు వర్షంలో 4 కిలోమీటర్లు నడక

మనిషి జీవితంలో వివాహం అనేది ఒక అద్భతమైన ఘట్టం. కొంతమంది వినూత్నంగా పెళ్లిళ్లు చేసుకుంటుంటారు. జీవితకాలం గుర్తుండిపోవాలని అనుకుంటుంటారు. తన జీవిత భాగస్వామికి ఆశ్చర్యకరమైన రీతిలో వివాహ ఏర్పాట్లు చేసుకుంటుంటారు. ఇలాగే ఓ వ్యక్తి తన భార్య కోసం చేసిన పని నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఓ జాతీయ వార్తా ఏజెన్సీ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది. క్షణాల్లో ఈ ఫొటో వైరల్ అయ్యింది. ఎంత రోమాంటిక్ బంధం, ప్రేయసి కోసం పాట్లు అంటూ..కామెంట్స్ పెడుతున్నారు.

Read More : నిర్భయ కేసు..ఉరి బిగిసేనా? : తీహార్‌కు చేరుకున్న తలారీ

 

అసలు ఏం జరిగిందంటే :- 
ఉత్తరాఖండ్..చమోలి జిల్లాలో బిజ్రా గ్రామానికి చెందిన యువతికి వేరే గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. ఇరు కుటుంబాలు పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నాయి. కానీ..బిజ్రా గ్రామానికి చేరుకోవడానికి సరైన రవాణా సదుపాయం లేదు. అంతేకాదు..జనవరి మాసంలో ఇక్కడ విపరీతమైన మంచు కురుస్తుంటుంది. కాలి నడకన వెళ్లే రహదారులు మొత్తం మంచుతో కప్పుకపోయాయి. కొన్ని రహదారులను సైతం మూసివేశారు.

 

దీంతో ఏం చేయాలా అని వరుడు ఆలోచించాడు. ముహూర్త సమాయానికి వధువు ఇంటికి చేరుకోవాల్సి ఉంది. దీంతో అతను కాలికి పనిచెప్పాడు. పెళ్లి దుస్తులు ధరించాడు. చేతిలో గొడుగు పట్టుకున్నాడు. ఛలో..ఛలో..అంటూ నడుచుకుంటూ వెళ్లాడు. ఇలా ఏకంగా 4 కిలోమీటర్ల మేర నడిచాడు. ఇతని వెంట కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. వరుడు నవ్వుతూ నడుచుకుంటూ..వెళుతున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇతని చేసిన పనిని ప్రశంసిస్తున్నారు.