Odisha : వధువు కోసం పాదయాత్ర .. కార్లున్నా రాత్రంతా 28 కిలోమీటర్లు నడిచి వెళ్లి మూడుముళ్లు వేసిన వరుడు

ఒడిశాలోని రాయగడ జిల్లాలో వరుడు పాదయాత్రగా వెళ్లి వధువు మెడలో మూడు ముళ్లు వేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వధువు ఇంటికి వెళ్లటానికి నాలుగు కార్లు ఏర్పాటు చేసుకున్నా వరుడు రాత్రి అంతా 28 కిలోమీటర్లు నడిచి వెళ్లి వధువు ఇంటికెళ్లి వివాహం చేసుకున్నాడు.

Odisha : వధువు కోసం పాదయాత్ర .. కార్లున్నా రాత్రంతా 28 కిలోమీటర్లు నడిచి వెళ్లి మూడుముళ్లు వేసిన వరుడు

Groom with family walk 28 km for wedding

Odisha Groom with family walk 28 km for wedding : ఒడిశాలోని రాయగడ జిల్లాలో వరుడు పాదయాత్రగా వెళ్లి వధువు మెడలో మూడు ముళ్లు వేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వధువు ఇంటికి వెళ్లటానికి నాలుగు కార్లు ఏర్పాటు చేసుకున్నా వరుడు రాత్రి అంతా 28 కిలోమీటర్లు నడిచి వెళ్లి వధువు ఇంటికెళ్లి వివాహం చేసుకోవాల్సి వచ్చింది. అదేంటీ పాదయాత్రగా వెళ్లటమేంటీ? అదొ మొక్కా ఏంటీ అనుకోవచ్చు. అటువంటిదేమీలేదు. అసలు కారణమేంటో తెలుసుకుందాం..

వరుడు , అతని కుటుంబ సభ్యులు, బంధువులు అంతా రాయగడ జిల్లాలోని కల్యాణ్ సింగ్ పూర్ బ్లాక్ పరిధిలోని సునఖండీ పంచాయితీకి చెందిన యువకుడికి దిబలపాడు గ్రామానికి చెందిన యువతికి వివాహం నిశ్చయమైంది. పెళ్లి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. పెళ్లి ఏర్పాట్లు పూర్తయ్యాయి.. ఇక పెండ్లి కొడుకు పెండ్లికూతురు ఇంటికి వెళ్లి వివాహం చేసుకోవాలి..దీని కోసం వరుడు కుటుంబం నాలుగు కార్లను ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఇంతలోనే డ్రైవరలు సమ్మెకు దిగారు.. ఏం చెయ్యాలో అర్థంకాని పరిస్థితి.. అటు పెండ్లికూతురు తరఫువాళ్లు ఎదురుచూస్తున్నారు.. ఇటు వాహనాలు లేవు..

ఇక చేసేదేమీ గురువారం (మార్చి 16,2023)రాత్రి వధువు ఇంటికి చేరుకోవటానికి నడక ప్రారంభించారు. అలా రాత్రి అంతా నడుస్తూ ఎట్టకేలకు మరునాడు అంటే శుక్రవారం వధువు గ్రామం దిబలపాడుకు చేరుకున్నారు. అలా 28కిలోమీటర్లు నడిచి వచ్చి మరీ వధువు మెడలో మూడు ముళ్లు వేశాడు వరుడు. అలా శుక్రవారం (March 17th) విహాహం ఘనంగా జరిగింది. వరుడు,అతని కుటుంబ సభ్యులు కొంతమంది మహిళలు రాత్రిపూట నడుచుకుంటూ వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే వరుడు,అతని కుటుంబ సభ్యులు వధువు ఇంటి వద్దే ఉండి, వారు ఇంటికి తిరిగి రావడానికి డ్రైవర్ల సంఘం సమ్మె విరమించే వరకు వేచి ఉంచి తిరిగి వారి గ్రామం చేరుకున్నారు. శుక్రవారం డ్రైవర్లు సమ్మె విరమించటంతో వధువును తమతో పాటు తమ గ్రామానికి కార్లలో తీసుకెళ్లారు.

కాగా ఒడిశాలో డ్రైవర్లు బీమా, పింఛన్‌, సంక్షేమ బోర్డు ఏర్పాటు వంటి సామాజిక సంక్షేమ కార్యక్రమాలను డిమాండ్‌ చేస్తూ డ్రైవర్‌ ఏక్తా మహాసంఘ్‌ బుధవారం (మార్చి15 నుంచి)రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టింది. కానీ మనం చెప్పుకున్న ఈ వరుడి వివాహం మార్చి 17న జరగాల్సి ఉంది. ఈక్రమంలో వేరే దారిలేక రాత్రి అంతా నడుచుకుంటు వధువు ఇంటికి వచ్చి వివాహం చేసుకుని డ్రైవర్లు సమ్మె విరమించేవరకు అక్కడే ఉండాలనుకున్నారు. కానీ శుక్రవారం సాయంత్రం డ్రైవర్లు సమ్మె విరమించటంతో వధువును తమ ఇంటికి తీసుకెళ్లారు.