Varun Singh : వీరుడా వందనం..గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ కు తుది వీడ్కోలు

డిసెంబర్-8న తమిళనాడు హెలికాప్టర్​ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన గ్రూప్​ కెప్టెన్​ వరుణ్​ సింగ్​ అంత్యక్రియలు ఇవాళ(డిసెంబర్-17,2021)ప్రభుత్వ, సైనిక

Varun Singh : వీరుడా వందనం..గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ కు తుది వీడ్కోలు

Varun (1)

Varun Singh :  డిసెంబర్-8న తమిళనాడు హెలికాప్టర్​ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన గ్రూప్​ కెప్టెన్​ వరుణ్​ సింగ్​ అంత్యక్రియలు ఇవాళ(డిసెంబర్-17,2021)ప్రభుత్వ, సైనిక లాంఛనాల మధ్య నిర్వహించారు. మధ్యప్రదేశ్​లోని భోపాల్ జిల్లాలోని బైరాగఢ్​ ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర సీఎం శివరాజ్​ సింగ్​ చౌహాన్ హాజరై, వరుణ్​ సింగ్ కు నివాళులు అర్పించారు.​ వరుణ్​ సింగ్​ కుటుంబానికి రూ. కోటి సాయంతో పాటు ఒకరికి ఉద్యోగం కల్పించనున్నట్లు ఇప్పటికే సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే.

కాగా, ఈ నెల ఎనిమిదివ తారీఖున తమిళనాడులోని కూనూర్ సమీపంలో ఎయిర్ ఫోర్స్ కి చెందిన హెలికాఫ్టర్ కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంతో దేశపు తొలి త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ దంపతులతో కలిపి 13 మంది అదే రోజు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ప్రమాదం నుంచి 80 శాతాలతో కాలినగాయాలతో బయటపడిన వరుణ్​ సింగ్​కు తొలుత వెల్లింగ్టన్​ ఆర్మీ హాస్పిటల్ లో, ఆ తర్వాత బెంగళూరు మిలిటరీ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ అందించినా ఫలితం లేకపోయింది. 8 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఈ నెల 15న రుణ్​ సింగ్ కన్నుమూశారు.

శౌర్య చక్ర విజేత

గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ సైనికుల కుటుంబంలో జన్మించాడు. వరుణ్ సింగ్ స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లా. వరుణ్ తండ్రి కే.పీ సింగ్ ఇండియన్ ఆర్మీ రెజిమెంట్ ఆఫ్ ఎయిర్ డిఫెన్స్ నుండి కల్నల్‌గా పదవీ విరమణ చేశారు. వరుణ్ సోదరుడు లెఫ్టినెంట్ కమాండర్ తనూజ్ సింగ్ ఇప్పుడు భారత నౌకాదళంలో పనిచేస్తున్నాడు.

వరుణ్ సింగ్​ ఇప్పటికే ఓసారి మృత్యువు అంచు వరకు వెళ్లి వచ్చారు. గతేడాది అక్టోబర్​లో.. ఆయన నడుపుతున్న తేజస్​ విమానంలో.. గాలిలో ఉన్న సమయంలోనే అనూహ్యంగా సాంకేతిక లోపం తలెత్తింది. ఆ సమయంలో వరుణ్​.. విమానం నుంచి దూకేందుకు ఆస్కారం ఉంది. అయినప్పటికీ ధైర్యసాహసాలను ప్రదర్శిస్తూ, సమయస్ఫూర్తితో విమానాన్ని నడిపారు. పరిస్థితులను అర్థం చేసుకుని విమానాన్ని సురక్షితంగా నేలకు తీసుకొచ్చారు. వరుణ్​ ధైర్యసాహసాలను ప్రశంసిస్తూ.. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టులో ఆయన్ని శౌర్య చక్రతో సత్కరించింది.

ALSO READ Miss world 2021 : మిస్ వరల్డ్ పోటీలు వాయిదా, హైదరాబాద్ మానసకు కరోనా