ISRO GSLV – 10 : రాకెట్ ప్రయోగం విఫలం, ఇస్రో వర్గాల్లో నిరాశ..లైవ్ స్ట్రీమ్ నిలిపివేత

GSLV - 10 : రాకెట్ ప్రయోగం పూర్తి కాలేదు. రాకెట్ ప్రయోగం విఫలం చెందింది. దీంతో ఇస్రో వర్గాలు తీవ్ర నిరాశలో మునిగిపోయాయి. లైవ్ స్ట్రీమ్ ఆపడంతో ఏమి జరుగుతుందో తెలియరాలేదు. మూడో దశలో సాంకేతిక లోపం తలెత్తిందని తెలుస్తోంది.

ISRO GSLV – 10 : రాకెట్ ప్రయోగం విఫలం, ఇస్రో వర్గాల్లో నిరాశ..లైవ్ స్ట్రీమ్ నిలిపివేత

Gslv F 10 Rocket

GSLV – 10 : రాకెట్ ప్రయోగం పూర్తి కాలేదు. రాకెట్ ప్రయోగం విఫలం చెందింది. దీంతో ఇస్రో వర్గాలు తీవ్ర నిరాశలో మునిగిపోయాయి. లైవ్ స్ట్రీమ్ ఆపడంతో ఏమి జరుగుతుందో తెలియరాలేదు. మూడో దశలో సాంకేతిక లోపం తలెత్తిందని తెలుస్తోంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం రెండో ప్రయోగవేదిక నుంచి సరిగ్గా 5 గంటల 43 నిమిషాలకు GSLV-F10ని ప్రయోగించారు శాస్త్రవేత్తలు. కొన్ని సెకన్లలోనే నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకుపోయింది GSLV-F10. అయితే..ప్రయాణించాల్సిన మార్గంలో కాకుండా…మరో మార్గంలో రాకెట్ వెళ్లిపోయింది. రెండు దశల వరకు రాకెట్ విజయవంతంగా దూసుకెళ్లింది. క్రయోజనిక్ దశలో జీఎల్ఎల్వీ -ఎఫ్ 10 రాకెట్ లో సమస్య ఏర్పడింది. రాకెట్ ప్రయోగం విఫలమైందని ఇస్రో ఛైర్మన్ శివన్ ప్రకటించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో జియో సింక్రోనస్ లాంచింగ్ శాటిలైట్ వెహికల్ ను బుధవారం 3.43 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. అనంతరం గురువారం ఉదయం 5.43 గంటలకు ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు.

ప్రయోగం సక్సెస్ అయితే…

రెండు వేల 268 కిలోల బరువున్న GISAT-1 ఉపగ్రహానికి EOS 03 కోడ్ ఇచ్చారు. GISAT-1 భూ పరిశీలన ఉపగ్రహం. ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్ కాబట్టే దీనికి EOS- 03 అని పేరు పెట్టారు. ఈ ఉపగ్రహాన్ని…జియో ఇమేజింగ్ శాటిలైట్-1 అని కూడా పిలుస్తారు. దీని ఎత్తు 51.70 మీటర్లు. బరువు రెండు వేల 268 కిలోలు. GISAT-1 మిషన్ లైఫ్ టైం పదేళ్లు. ఈ శాటిలైట్‌ దేశ రక్షణ, విపత్తుల నిర్వహణకు ఎంతగానో ఉపయోగపడనుంది. శత్రు దేశాల కదలికలను ఇట్టే పసిగట్టవచ్చు. అంతరిక్షంలో ఇస్రో కన్ను సాయంతో భారత్‌తో పాటు చైనా, పాక్‌ సరిహద్దులను కూడా పర్యవేక్షించవచ్చు. భూ పరిశీలన ఉపగ్రహం ప్రతి రోజూ నాలుగైదు దేశాల చిత్రాలను పంపనుంది. వాటి సాయంతో..నీటి వనరులు, పంటలు, తుపానులు, వరదలు, అటవీ విస్తీర్ణంలో మార్పులను రియల్‌టైమ్‌లో పర్యవేక్షించడం సాధ్యమవుతుంది.