ఫిబ్రవరిలో పడిపోయిన జీఎస్టీ వసూళ్లు

  • Published By: vamsi ,Published On : March 1, 2019 / 12:34 PM IST
ఫిబ్రవరిలో పడిపోయిన జీఎస్టీ వసూళ్లు

వస్తు, సేవల పన్ను(GST) వసూళ్లు ఫిబ్రవరి నెలలో భారీగా తగ్గిపోయాయి. గత నెల రూ.లక్ష కోట్లకు పైగా వచ్చిన GST వసూళ్లు.. ఫిబ్రవరి నెలలో మాత్రం రూ.97,247కోట్లకు పడిపోయినట్లుగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. మొత్తం రూ.97,247కోట్లు వసూలు కాగా అందులో కేంద్ర జీఎస్టీ (CGST)) రూ.17,626కోట్లు, రాష్ట్ర జీఎస్టీ (SGST) రూ.24,192కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (IGST) రూ.46,953 కోట్లు (దిగుమతుల మీద వసూలైన సెస్‌ కింద (రూ.21,384కోట్లు), సెస్‌ కింద రూ.8,476కోట్లు వసూలయ్యాయి. విక్రయాలకు సంబంధించి దాఖలయ్యే రిటర్నింగ్స్(GSTR-3B) 73.48లక్షలకు చేరాయి.
Read Also : దేశం విడిచి వెళ్లిపో.. పాక్ మహిళను ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఫిబ్రవరి నాటికి జీఎస్టీ వసూళ్ల ద్వారా ప్రభుత్వం మొత్తం రూ.10.70 లక్షల కోట్లు రాబట్టుకోగా.. బడ్జెట్ లో ప్రభుత్వం వార్షిక జీఎస్టీ వసూళ్ల లక్ష్యాన్ని రూ.13.48లక్షల కోట్లుగా నిర్దేశించుకుంది. గత నెల జీఎస్‌టీ వసూళ్లు రూ.1.02లక్షల కోట్లు వచ్చాయి. ఒక నెలలో జీఎస్‌టీ వసూళ్లు రూ.లక్ష కోట్లను దాటడం మూడోసారి. 2018ఏప్రిల్, అక్టోబరు నెలలలో ఈ స్థాయిని వసూళ్లు అధిగమించాయి.