GST: జీఎస్టీ స్లాబుల్లో మార్పు లేదు: కేంద్రం

జీఎస్టీ స్లాబుల్లో మార్పులు చేస్తారంటూ వస్తున్న వార్తలపై కేంద్రం స్పందించింది. 5 శాతం ఉన్న జీఎస్టీని 8 శాతానికి పెంచనున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది.

GST: జీఎస్టీ స్లాబుల్లో మార్పు లేదు: కేంద్రం

Gst

GST SLAB: జీఎస్టీ స్లాబుల్లో మార్పులు చేస్తారంటూ కొంతకాలంగా వస్తున్న వార్తలపై కేంద్రం సోమవారం స్పందించింది. ఐదు శాతం ఉన్న జీఎస్టీ స్లాబును ఎనిమిది శాతానికి పెంచనున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని కేంద్రంలోని జీఎస్టీ కౌన్సిల్ స్పష్టం చేసింది. ప్రస్తుతం జీఎస్టీలో ఐదు శాతం, పన్నెండు శాతం, పద్దెనిమిది శాతం, ఇరవై ఎనిమిది శాతం అంటూ నాలుగు స్లాబులున్న సంగతి తెలిసిందే. అయితే బంగారం, నగలపై మాత్రం మూడు శాతం జీఎస్టీ విధిస్తున్నారు. కాగా, నాన్ ఫుడ్ ఐటమ్స్‌ను కూడా మూడు శాతం స్లాబులోకి తీసుకురాబోతున్నారని ప్రచారం జరిగింది.

GST 5 శాతం శ్లాబు ఎత్తివేత!

దీనిపై కూడా జీఎస్టీ కౌన్సిల్ స్పందించింది. ప్రస్తుతం ఉన్న స్లాబుల్లో మార్పులు చేయాలంటూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రకటించింది. జీఎస్టీ స్లాబుల్లో మార్పులపై గత ఏడాది జీఎస్టీ కౌన్సిల్ ఒక టీమ్ ఏర్పాటు చేసింది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ఆధ్వర్యంలో కొంతమంది మంత్రులతో ఒక కమిటీ వేసింది. అయితే, ఈ కమిటీ ఇప్పటివరకు తన రిపోర్టును తయారు చేయలేదని కౌన్సిల్ తెలిపింది. మరోవైపు జీఎస్టీ కౌన్సిల్ తదుపరి సమావేశంపై కూడా స్పష్టత లేదు. కారణం.. కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ అమెరికాలో ఉన్నారు.

AP Property Tax : ఏపీ ప్రజలకు మరో షాక్.. ఆస్తి పన్ను పెంపు

కమిటీ నివేదిక ఇంకా రెడీ కాకపోవడంతోపాటు, జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరుగకపోవడం వల్ల జీఎస్టీ స్లాబుల మార్పులపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం నిత్యావసర వస్తువుల్ని ఐదు శాతం స్లాబులోకి, లగ్జరీ వస్తువులను ఇరవై ఎనిమిది శాతం స్లాబులోకి తీసుకొచ్చే ప్రతిపాదనలున్నాయి.