ఇళ్ల కొనుగోలుదారులకు జీఎస్టీ మినహాయింపు!

  • Published By: venkaiahnaidu ,Published On : February 1, 2019 / 07:14 AM IST
ఇళ్ల కొనుగోలుదారులకు జీఎస్టీ మినహాయింపు!

ఇళ్ల కొనుగోలుదారులకు జీఎస్టీ మినహాయింపుపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు ఇవాళ(ఫిబ్రవరి-1) లోక్ సభలో  బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా తాత్కాలిక మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. మంత్రివర్గ ఉపసంఘం నివేదికను GST మండలి ముందు ప్రవేశపెట్టి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. GST వసూళ్లు ఈ ఏడాది జనవరి నాటికి రూ. లక్ష కోట్లకు చేరిందన్నారు. ప్రస్తుతం నెలకు రూ.97వేల 100 కోట్లుగా పన్ను వసూళ్లు ఉన్నాయన్నారు. డిచిన ఐదేళ్లల్లో రాష్ట్రాల పన్ను వసూళ్లు  14శాతం మేర పెరిగినట్లు తెలిపారు.

కొత్తగా ఇళ్ల కొనుగోలుదారులు ప్రస్తుతం 12శాతం GST చెల్లించాల్సి ఉంటుంది. ఇది భారంగా ఉందని రియల్ ఎస్టేట్ రంగం అంటోంది. ఈ డిమాండ్ ను పరిశీలించిన నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రకటించారు మంత్రి. ప్రస్తుతం 12 శాతంగా ఉన్న GSTని తగ్గించాలా.. మినహాయించాలా అనేది GST మండలిలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.