ఏప్రిల్ నుంచి GST కొత్త విధానం..చేతి ఖర్చుల్లో 4 శాతం ఆదా – నిర్మలా

  • Published By: madhu ,Published On : February 1, 2020 / 05:53 AM IST
ఏప్రిల్ నుంచి GST కొత్త విధానం..చేతి ఖర్చుల్లో 4 శాతం ఆదా – నిర్మలా

GSTతో ప్రజలకు రూ. లక్ష కోట్ల లబ్ది జరిగిందని చెప్పారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. జీఎస్టీ అమలుతో ప్రజలపై పన్ను భారం తగ్గిందని చెప్పారు. జీఎస్టీ ద్వారా ప్రజలకు లాభాలు చేకూర్చాయని అన్నారు. దీనివల్ల నెలవారీ ఖర్చు 4 శాతం ఆదా అయ్యాయని అంచనా వేశారు. 

జీఎస్టీ వల్ల దేశంగాని రాష్ట్రాలు గాని స్వతంత్రను కోల్పోలేదని, రాజకీయాలకు అతీతంగా తాము నిర్ణయాలు తీసుకోవడం జరుగుతోందని తెలిపారు. 2020 – 21 సంవత్సరానికి బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ఫిబ్రవరి 01వ తేదీ శనివారం ప్రవేశపెట్టారు. 

జీఎస్టీ విషయంలో అరుణ్ జైట్లీ ముందుచూపుతో వ్యవహరించారని కొనియాడారు. పన్ను మినహాయింపుల ద్వారా వినియోగదారులకు రూ. 1లక్ష కోట్లు లబ్ది చేకూర్చడం జరిగిందన్నారు. జీఎస్టీ ద్వారా గత రెండు సంవత్సరాల్లో 16 లక్షల కొత్త పన్ను చెల్లింపుదారులు చేరినట్లు తెలిపారు.  జీఎస్టీ అమలుతో టోల్ ఆదాయం పెరిగిందన్నారు. చాలా ట్యాక్స్‌లను జీఎస్టీ పరిధిలోకి తెచ్చామన్నారు.

అన్ని రంగాల్లో వృద్ధి రేటు పెరిగితేనే వ్యవస్థ చక్కబడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశ సంపద పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని సూచించారు. సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు వద్దకు చేరుతున్నాయని, రూపాయిలో 15 పైసలు మాత్రమే సామాన్యులకు చేరుతున్నాయన్నారు. 

* పసుపు రంగు చీర ధరించిన నిర్మలా..ఎర్రటి వస్త్రంలో చుట్టి..రాజముద్ర ఉన్న ఉన్న సంచిలో బడ్జెట్ ప్రతులు తీసుకొచ్చారు.
* బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఆర్థిక మంత్రులు బ్రీఫ్ కేసుతో మీడియా ముందుకొచ్చిన సంగతి తెలిసిదే.
* ఈ సంప్రదాయానికి నిర్మలా తెరిదించారు.

* 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్..నలుగు రంగు బ్రీఫ్ కేసుతో మీడియా ముందుకు వచ్చారు. 
* బడ్జెట్ ప్రవేశపెట్టడం నిర్మలా ఇది రెండోసారి.
* ఇది సామాన్యుల బడ్జెట్‌గా అభివర్ణించారు.
 

* ఆర్థిక ప్రగతికి సంస్కరణలు అవసరమని స్పష్టం చేశారు.
* ప్రజల ఆదాయం పెంచేందుకు సత్వరచర్యలు తీసుకుంటున్నట్లు, ప్రజల ఆదాయం పెంచడమే బడ్జెట్ లక్ష్యమన్నారు. 

Read More : కేంద్ర బడ్జెట్ 2020-21 : ఇది సామాన్యుల బడ్జెట్ – నిర్మలా