జీఎస్టీ తగ్గింపు : గృహాల కొనుగోలుదారులకు భారీ ఊరట

  • Published By: venkaiahnaidu ,Published On : February 24, 2019 / 01:29 PM IST
జీఎస్టీ తగ్గింపు : గృహాల కొనుగోలుదారులకు భారీ ఊరట

గృహాల కొనుగోలుదారులకు జీఎస్టీ కౌన్సిల్ ఆదివారం(ఫిబ్రవరి-24,2019) గుడ్ న్యూస్ చెప్పింది. నిర్మాణంలో ఉన్న నివాస సముదాయాల విక్రయంపై విధించే జీఎస్టీని ఎటువంటి ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ లేకుండా ప్రస్తుతమున్న 12శాతం నుంచి 5శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. అంతేకాకుండా అందుబాటు గృహాలపై ప్రస్తుతమున్న 8శాతం నుంచి 1శాతానికి తగ్గించినట్లు తెలిపారు.

కొత్త ట్యాక్స్ రేట్లు ఏప్రిల్-1,2019 నుంచి అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు. జీఎస్టీ తగ్గింపు.. నిర్మాణరంగానికి మంచి ఊపునిస్తుందని జైట్లీ తెలిపారు. జీఎస్టీని భారీగా తగ్గిస్తూ తీసుకొన్న కారణంగా సామాన్యుడి సొంతిటి కల నెరవేరే అవకాశముందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో జీఎస్టీ తగ్గింపు నిర్ణయం  మోడీ సర్కార్ కు  బాగా కలిసి వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.