Anti Covid Drug 2DG : 2డీజీ డ్రగ్ కావాలా? ఇవీ గైడ్‌లైన్స్

డీఆర్డీవో రూపొందించిన కరోనా మందు 2-డీజీ డ్రగ్ వినియోగంపై మార్గదర్శకాలు జారీ చేశారు. కొవిడ్-19 వైద్యంలో అత్యవసర వినియోగం కింద అనుమతించారు. మధ్యస్థ నుంచి తీవ్రస్థాయి లక్షణాలున్న కేసుల్లో మాత్రమే వినియోగించాలని చెప్పారు. పాజిటివ్‌గా గుర్తించిన వెంటనే

Anti Covid Drug 2DG : 2డీజీ డ్రగ్ కావాలా? ఇవీ గైడ్‌లైన్స్

Guidelines For Getting And Usage Of Anti Covid Drug 2dg

Anti Covid Drug 2DG : డీఆర్డీవో రూపొందించిన కరోనా మందు 2-డీజీ డ్రగ్ వినియోగంపై కేంద్రం మార్గదర్శకాలు జారీ చేశారు. కరోనా చికిత్సలో అత్యవసర వినియోగం కింద దీన్ని అనుమతించారు. మధ్యస్థ నుంచి తీవ్రస్థాయి లక్షణాలున్న కేసుల్లో మాత్రమే ఈ డ్రగ్ ను వాడాలని కేంద్ర చెప్పింది. పాజిటివ్‌గా గుర్తించిన వెంటనే గరిష్టంగా 10 రోజుల పాటు డ్రగ్ ఇవ్వొచ్చని కేంద్రం పేర్కొంది. ఆసుత్రుల్లో డాక్టర్ల సూచన మేరకు మాత్రమే డ్రగ్ వినియోగించాలని స్పష్టం చేసింది.

నియంత్రణ లేని మధుమేహం, తీవ్రమైన హృద్రోగ సమస్యలు, తీవ్ర శ్వాసకోస సమస్యలు, తీవ్ర హెపాటిక్ రీనల్ ఇంపెయిర్మెంట్ సమస్యలున్న వారిపై ఈ డ్రగ్‌ను పరీక్షించ లేదు. కాబట్టి అలాంటి వారికి వినియోగించే సమయంలో మరిన్ని జాగ్రత్తలు అవసరమని కేంద్రం చెప్పింది. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, 18ఏళ్ల లోపువారికి 2-డీజీ డ్రగ్ ఇవ్వరాదని కేంద్రం స్పష్టం చేసింది. రోగులు, వారి బంధువులు ఈ డ్రగ్ కోసం ఆస్పత్రి యాజమాన్యాలను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌ను సంప్రదించాలి. అలాగే 2dg@drreddys.comకు మెయిల్ చేయడం ద్వారా డ్రగ్ సప్లయ్ కోరవచ్చు.

కరోనాపై పోరుకు డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన కొవిడ్‌-19 ఔషధం 2-డియాక్సీ డి-గ్లూకోజ్‌(2డీజీ). పొడి రూపంలో ఉండే ఈ ఔషధాన్ని నీటితో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల.. వైర‌స్ ఉన్న క‌ణాల్లోకి చేరి, దాని వృద్ధిని అడ్డుకుంటుంద‌ని డీఆర్‌డీఓ వివరించింది. కరోనాకు ఇప్పటివరకు వ్యాక్సిన్లను మాత్రమే ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఈ పొడిని తయారు చేసింది. దీనిని కరోనా రోగులకు ఎమర్జెన్సీ వాడకానికి వాడవచ్చని… భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఇచ్చింది.

డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సహకారంతో డీఆర్‌డీఓకు చెందిన ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ మెడిసిన్‌ అండ్‌ అలైడ్‌ సైన్సెస్‌ (INMAS) ఈ డ్రగ్‌ను అభివృద్ధి చేసింది. ఓ మోస్తరు నుంచి తీవ్రమైన కొవిడ్‌ లక్షణాలున్న వారిలో ఇది సమర్థంగా పనిచేస్తున్నట్లు క్లినికల్‌ ట్రయల్స్‌లో వెల్లడైంది. క‌రోనా బాధితులకు ప్రధాన చికిత్స చేస్తూ అద‌నంగా ఈ డ్రగ్‌ను ఇస్తే వారు వేగంగా కోలుకునే అవ‌కాశం ఉంటుంద‌ని, ఆక్సిజన్ అవసంర ఉండదని వివరించింది.