11 days baby corona : పుట్టిన ఐదు రోజులకే కరోనా..11రోజుల పసిబిడ్డకు ప్లాజ్మా చికిత్స

11 days baby corona : పుట్టిన ఐదు రోజులకే కరోనా..11రోజుల పసిబిడ్డకు ప్లాజ్మా చికిత్స

Gujarat 11 Days Infant Tested Coronavirus Positive (1)

Gujarat 11 days infant corona positive  : మన భారత్ లోనే కాకుండా కరోనా సెకండ్ వేవ్ ప్రపంచ వ్యాప్తంగా కూడా హడలెత్తిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో అయితే మరోసారి లాక్ డౌన్ అమలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ సెకండ్ వేవ్ మరింత ప్రతాపాన్ని చూపిస్తున్న కరోనా పసిబిడ్డలను కూడా వదలటంలేదు. ఈ క్రమంలో ఓ పసిబిడ్డకు పుట్టిన ఐదు రోజులకే కరోనా సోకింది. దీంతో పసిబిడ్డకు చికిత్సనందిస్తున్నారు. ఇప్పుడా ఐదు రోజుల పసిపాపకు 11 రోజులు. గుజరాత్‌లోని సూరత్‌లో 11 రోజుల నవజాత శిశువుకు కరోనా చికిత్స చేస్తున్నారు. ఆ శిశువు జన్మించిన ఐదవ రోజున కరోనాకు గురైంది. ఈ శిశువుకు తల్లి నుంచే కరోనా సంక్రమించి ఉండవచ్చని డాక్టర్లు భావిస్తున్నారు.

గుజరాత్ లోని అమ్రెలి ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల గర్భిణిని ఏప్రిల్ 1 తేదీన ప్రసవం కోసం డైమండ్ ఆసుపత్రిలో చేర్చారు. అదేరోజు ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో ఆ బిడ్డ పుట్టిన ఐదు రోజులకే ఏప్రిల్ 6న పాప శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడటంతో పరీక్షలు చేయగా కరోనా సోకినట్లుగా తేలింది. దీంతో పసిబిడ్డకు వెంటిలేటర్ పై చికిత్సనందిస్తున్నారు.

దీనిపై చిన్నపిల్లల నిపుణులు డాక్టర్ అల్పేష్ సిఘ్వీ మాట్లాడుతూ..ఆ శిశువు పుట్టిన వెంటనే శ్వాస సంబంధిత సమస్యతో బాధపడిందని దీంతో తాము చికిత్స అందించామని తెలిపారు. బిడ్డ తల్లి ఆరోగ్యంగానే ఉండటంతో ఆమెను డిశ్చార్జి చేశామని..కానీ శిశువుకు చికిత్సనందించే దశలో తల్లి పాలకు బదులు ఫార్ములా ఫీడ్ ఇచ్చామన్నారు. తరువాత కొన్ని రోజులకు తల్లిని పిలిపించి శిశువుకు తల్లిపాలు ఇప్పించామని తెలిపారు.

శ్వాస తీసుకోవటంతో శిశువు ఇబ్బంది పడుతుండటంతో అనుమానం వచ్చి..ఎక్స్ రే తీయగా..ఏదో సమస్య ఉన్నదని గుర్తించి యాంటీజెన్ టెస్టు చేశామన్నారు. దీనిలో ఆ శిశువుకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ శిశువును వెంటిలేటర్‌పై ఉంచి, చికిత్స అందిస్తున్నామన్నారు. చిన్నారికి రెమిడెసివిర్ ఇంజిక్షన్ ఇచ్చామన్నారు. ఆ చిన్నారికి ప్లాజ్మా చికిత్స అందించనున్నామని..ప్రస్తుతం పాప పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.