Train Coach: రైలు కోచ్‌లో టీనేజర్ ఆత్మహత్యకు కారణం గ్యాంగ్ రేప్!!

కాలేజీకి ఇంట్లో నుంచి వెళ్లిన 19ఏళ్ల యువతి తిరిగి ఇంటికి చేరుకునే క్రమంలో ఎక్కిన ట్రైన్ లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ట్రైన్ కోచ్ లో మృత దేహాన్ని, డైరీలో రాసిన వివరాలను..

Train Coach: రైలు కోచ్‌లో టీనేజర్ ఆత్మహత్యకు కారణం గ్యాంగ్ రేప్!!

Train Coach

Train Coach: కాలేజీకి ఇంట్లో నుంచి వెళ్లిన 19ఏళ్ల యువతి తిరిగి ఇంటికి చేరుకునే క్రమంలో ఎక్కిన ట్రైన్ లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ట్రైన్ కోచ్ లో మృత దేహాన్ని, డైరీలో రాసిన వివరాలను బట్టి పోలీసులు గ్యాంగ్ రేప్ గా అనుమానిస్తున్నారు. నవంబర్ 4న దక్షిణ గుజరాత్ లో జరిగిన ఈ ఘటనను యాక్సిడెంటల్ డెత్‌గా నమోదు చేసుకున్నారు పోలీసులు.

బాధితురాలి డైరీలో రాసుకున్న వివరాల ప్రకారం.. వడోదరాలో ఇద్దరు వ్యక్తులు ఆమెను ఆటోలో ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లినట్లు రాసి ఉంది. ఆ సమయంలో యువతిపై లైంగిక వేదింపులు ఏమైనా జరిగి ఉండొచ్చా అని అనుమానిస్తున్నారు.

బస్ డ్రైవర్ ను చూడగానే ఇద్దరు వ్యక్తులు పారిపోయారని.. యువతిని ఆమె స్నేహితురాలి దగ్గరకి బస్ డ్రైవరే చేర్చినట్లు విచారణలో తెలిసింది.

…………………………… : ఈ రోజు అర్ధరాత్రి నుంచి 7 రోజులు రాత్రి పూట రైల్వే రిజర్వేషన్ సిస్టమ్ పని చేయదు

దీనిపై గుజరాత్ ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకోనుంది. గ్యాంగ్ రేప్ కు గురై ఉండొచ్చని భావిస్తూ.. నిందితులను వెంటనే పట్టుకునే పనిలో ఉన్నామని సీఐడీ పోలీస్ ఇన్ స్పెక్టర్ మీడియాతో అన్నారు. దర్యాప్తులో భాగంగా దాదాపు 450 సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించామని, 25 బృందాలుగా విడిపోయి ఎంక్వైరీ చేస్తున్నట్లు తెలిపారు. వడోదరా సిటీ పోలీస్, అహ్మదాబాద్ సిటీ క్రైమ్ బ్రాంచ్, ఫోరెన్స్ సైన్స్ ల్యాబొరేటరీ, రైల్వే పోలీసులు కలిసి విచారణ చేస్తున్నారు.

వడోదరా సిటీ పోలీస్, రైల్వే పోలీస్, అహ్మదాబాద్ సిటీ క్రైమ్ బ్రాంచ్ అందరూ కలిసి సపరేట్ టీమ్స్ గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రాల్లోనూ ఎంక్వైరీ చేస్తున్నారు.

యువతి బ్యాగ్ లో నుంచి డైరీ దొరికింది. అందులో ఆమె కిడ్నాప్ కు గురైనట్లు, కళ్లగంతలు కట్టి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లినట్లు రాసుకుంది. ఇదంతా తాను ఇంటికి తిరిగి వచ్చే సమయంలోనే జరిగిందని ఉంది. అని వెస్టరన్ రైల్వే ఎస్పీ చెబుతూ.. గ్యాంగ్ రేప్ కు గురై ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేశారు.

……………………………………. : కోట్లు కోట్లు బొగ్గుకే ఖర్చు పెట్టెయ్యండి..

బాధితురాలి నుంచి మెడికల్ రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నారు పోలీసులు. ‘ఎఫ్ఐఆర్ లో ఇప్పటివరకూ రేప్ గురించి ఎటువంటి అంశాలు నమోదు చేయలేదు. పోస్టుమార్టం రిపోర్టును బట్టి ఆత్మహత్య చేసుకున్నట్లు మాత్రమే తెలిసింది. మరికొంత విచారణ జరిపి నిజాలు తెలుసుకుంటాం’ అని వివరించారు.