Gujarat : నా భర్త sperm నాకు ఇప్పించండీ..కోర్టును కోరిన భార్య

నా భర్త చనిపోయినా అతని పిల్లలకు తల్లినవ్వాలనుకుంటున్నా..నా భర్త వీర్యాన్ని భద్రపరిచి తనకు అందించేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టును కోరిన యువతి.

Gujarat : నా భర్త sperm నాకు ఇప్పించండీ..కోర్టును కోరిన భార్య

Wife Husband Of Man Dying Of Covid Seeks His Sperm

wife husband of man dying of Covid seeks his sperm : నా భర్త వీర్యాన్ని నాకు ఇప్పించండీ..ఆయన చనిపోయినా అతని పిల్లలకు నేను తల్లిగా ఉండాలని ఆశపడుతున్నా..కాబట్టి నా భర్త వీర్యాన్ని నాకు ఇప్పించండీ అంటూ ఓ భార్య కోర్టును కోరింది. ఓ పక్క ఆమె భర్త ప్రాణాలతో పోరాడుతున్నాడు..మరోపక్క అతని భార్య నా భర్త వీర్యాన్ని నాకు కావాలి..ఇచ్చేలా చేయండీ సార్..అని న్యాయస్థానాన్ని కోరింది. ఆమెకు అత్తమామలు కూడా అండగా నిలబడ్డారు.

భర్తను కాపాడుకోవటానికి అలనాటి సావిత్రి తన భర్త పిల్లలకు తల్లినికావాలని ఆ యమధర్మరాజును కోరి భర్తను కూడా కాపాడుకుంది. కానీ ఈ కరోనా యముడి నుంచి తన భర్త ప్రాణాలలో బైటపడతాడో లేదో తెలీయని ఓ భార్య తన భర్త పిల్లలకే తాను తల్లిని కావాలనుకుంటున్నానని అందుకే కరోనా మహమ్మారితో పోరాడుతున్న తన భర్త వీర్యాన్ని తనకు ఇప్పించాలని గుజరాత్ లోని అహ్మదాబాద్ కోర్టును కోరిందో యువతి.

గుజరాత్ లోని అహ్మాదాబాద్ లోని 29 ఏళ్ల యువతి భర్తకు కరోనా సోకింది. లైఫ్ సపోర్ట్ సిస్టమ్ మీద ఉన్నాడు. ఒక్కరోజుకు మించి అతను బతికే అవకాశం లేదని డాక్టర్ తెలిపారు. దీంతో ఆమె గుండె బద్దలైపోయింది. భర్తతో పిల్లాపాపలతో జీవించాలని ఆశపడిన ఆమె ఆశలు అడియాశలు చేసింది కరోనా మహమ్మారి. కానీ భర్త లేకపోయినా అతని పిల్లలకే తాను తల్లిని కావాలని ఆశపడింది. అదే విషయం అత్తమామలతో చెప్పింది. దానికి అత్తమామలు కూడా చలించిపోయారు. తమకు ఆమె కోడలు కాదు కూతురుగా భావించి అండగా నిలబడ్డారు.

ఈక్రమంలో అత్తామామలతో కలిసి ఆమె అహ్మదా హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. నా భర్త కరోనాతో పోరాడుతూ..లైఫ్ సపోర్ట్ సిస్టమ్ మీద ఉన్నాడు. ఒక్కరోజుకు మించి అతను బతికే అవకాశం లేదని డాక్టర్ తెలిపారని పిటిషన్ లో పొందుపరిచింది. నా భర్త చనిపోయినా..అతని పిల్లలకు తల్లిగా మారాలని తాను కోరుకుంటున్నానని అందుకే.. అతని వీర్యాన్ని భద్రపరిచి తనకు అందించేలా సదరు ఆసుప్రతివారికి ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును కోరిందామె.

ఈ పిటిషన్‌ను విచారించిన గుజరాత్ హైకోర్టు మంగళవారం (జులై20,2021) వడోదర ఆసుపత్రికి యువతి కోరిక మేరకు మరణం అంచున ఉన్న సదరు కోవిడ్ -19 రోగి స్పెర్మ్‌ను భద్రపరచాలని ఆదేశించింది. కానీ రోగి..పిటీషనర్ భర్త దీనికి అంగీకరించలేదు. దీంతో సదరు ఆసుపత్రి వర్గాలు ఆమె అభ్యర్థనను తిరస్కరించింది. కోవిడ్ తో అతను అపస్మారక స్థితిలో ఉన్నాడని..అతని శరీరంలో పలు అవయవాలు దెబ్బతిన్నాయని, వెంటిలెటర్ మీద ఉన్నడని..పెండింగ్‌లో ఉన్న అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ బిల్లు ప్రకారం స్పెర్మ్ ఇవ్వటానికి సదరు వ్యక్తి అనుమతి లేకుండా స్పెర్మ్ పొందలేమని తెలిపారు. అలా మీరు కావాలి అంటే కోర్టు నుంచి ఆర్డర్ తీసుకురావాలని తెలిపారు.

దీంతో సదరు రోగి భార్య అత్తమామలతో కలిసి వారి ఫ్యామిలీ లాయర్ నీలే పటేల్ ద్వారా కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.రోగి మరణానికి చేరువలో ఉన్నాడు కాబట్టి ఈ కేసును అత్యవసరంగా విచారించాలని యువతి తరపు లాయర్ కోర్టును అభ్యర్థించారు. ఈ అభ్యర్థన మేరకు జస్టిస్ ఆశితోష్ శాస్త్రి విచారణ చేపట్టారు.

బాధితుడు మే 10న కరోనాతో సదరు హాస్పిటల్ లో చేరాడని.. కాగా వైద్యులు ఇక అతను బతికే అవకాశాలు లేవని.. ఒక్కరోజుకు మించి బతికి ఉండకపోవచ్చని తేల్చారని లాయర్ కోర్టుకు తెలిపారు. దీంతో రోగి స్పెర్మ్ కలెక్ట్ చేయటానికి కోర్టు అనుమతి ఇచ్చింది. అలా సేకరించిన వీర్యాన్ని సంరక్షించాలని ఆసుపత్రిని ఆదేశించింది. ఈ క్రమంలో కోర్టు తుది ఆదేశాలు వచ్చే వరకు కృత్రిమ గర్భధారణకు వెళ్లడానికి కోర్టు అనుమతి ఇవ్వలేదు. ఈ కేసును కోర్టు గురువారం (జులై 22,2021)విచారించే అవకాశం ఉంది.