Girl Rape : 4 ఏళ్ల బాలికపై అత్యాచారం..5 రోజుల్లో రేపిస్టుకి జీవిత ఖైదు శిక్ష..

నాలుగేళ్ల చిన్నారిని అత్యాచారం చేసిన కామాంధుడికి కోర్టు 5 రోజుల్లో శిక్ష ఖరారు చేసింది. జీవితాంతం జైలులోనే ఉండాలని...శిక్ష విధించింది. సూరత్ కోర్టు

Girl Rape : 4 ఏళ్ల బాలికపై అత్యాచారం..5 రోజుల్లో రేపిస్టుకి జీవిత ఖైదు శిక్ష..

4 Year  Girl Raped In Surat Court Judgment Sentence In 5 Days

4 year  girl raped in surat court Judgment sentence in 5 days : నాలుగేళ్ల చిన్నారిపై కామాంధుడు కన్నేశాడు. ముద్దులొలికే చిట్టితల్లి జీవితాన్ని చిదిమేశాడు. కామాంధుడు పాల్పడిన అత్యాచారానికి ఆ చిన్నారి తాళలేక అపస్మాకరస్థితిలోకి వెళ్లిపోయింది. ఈ దారుణంపై పోలీసులు కేసు నమోదు చేసి 10రోజుల్లో కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. దీంతో కోర్టు బాలిక రేప్ కేసులో 60మంది ఇచ్చిన సాక్ష్యాధారాలు పరిశీలించి కామాంధుడికి జీవిత ఖైదు శిక్ష విధించింది. దోషి చనిపోయేవరకు అంటే ఆఖరిశ్వాస వరకు జైలులోనే గడపాలని శిక్ష ఖరారు చేసిన ఘటన గుజరాత్ లో జరిగింది. ఈ శిక్ష గుజరాత్ రాష్ట్రంలో తొలిసారిగా జరగటం విశేషం.

Read more : Jaipur court : 9ఏళ్ల బాలికపై అత్యాచారం కేసు..9 రోజుల్లో తీర్పు..రేపిస్టుకి 20 ఏళ్ల జైలుశిక్ష..!

నాలుగేళ్ల బాలికపై అత్యాచారం కేసులో అరెస్టయిన నిందితులపై సూరత్ పోలీసులు 10 రోజుల్లో కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయటం..సాక్ష్యాలను ప్రవేశపెట్టటం..కోర్టు నిందితుడికి జైలు శిక్ష విధించటం చకచకా జరిగిపోయాయి. కోర్టు దోషిగా తేలిన వ్యక్తికి 5 రోజులలోనే శిక్షను ఖరారు చేసింది. ఆఖరి శ్వాస వరకూ జీవిత ఖైదు శిక్షను విధించారు న్యాయమూర్తి.సూరత్‌లోని సచిన్ జిఐడిసి పోలీస్ స్టేషన్ ప్రాంతం నుండి అక్టోబర్ 12న నాలుగేళ్ల చిన్నారి కనిపించకుండాపోయింది.

Read more : Husband Kills His Wife : సాక్ష్యం చెప్పిన కూతురు..తండ్రికి జీవిత ఖైదు వేసిన కోర్టు

దీంతో కుటుంబ సభ్యులు సూరత్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో సూర్ కమిషనర్ అజయ్ కుమార్ తోమర్ తన బృందాలతో రంగంలోకి దిగారు. 10 పోలీసు బృందాలను ఏర్పాటు చేసారు. ఓ పక్క నిందితుడి కోసం గాలింపు.మరోపక్క బాధిత బాలిక కోసం గాలింపు ముమ్మరం చేశారు.అలా 10 పోలీసు బృందాలు ఐదు గంటలపాటు గాలించగా నిందుతుడు రాంశ్వర్ కాలనీ సమీపంలోని ఇండస్ట్రియల్ పార్క్ వెనుక పొదల్లో బాలిక కనుగొనబడింది.

Read more : 20ఏళ్లు జైలు శిక్ష : బాలికపై అత్యాచారం కేసులో సంచలన తీర్పు

బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లి తీవ్ర గాయాలపాలై ఆసుపత్రికి తరలించారు. బాలికపై అత్యాచారం జరిగిందని వైద్యులు ధృవీకరించారు. బాలిక ప్రైవేట్ భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. పోలీసులు నిందితుడి కోసం సీసీటీవీ ఫుటేజీ సహాయంతో గాలించారు. అలా అత్యాచారానికి పాల్పడిన 39 ఏళ్ల హనుమాన్ అలియాస్ అజయ్ మంగి నిషాద్‌ను గుర్తించి అరెస్టు చేశారు.10 రోజుల్లో పోలీసులు ఈ కేసులో చార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించారు. ఇందులో 60 మంది ప్రత్యక్ష సాక్షులు సూరత్‌లోని ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి పిఎస్ కాలా ముందు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో నిందితుడికి జీవిత ఖైదును విధిస్తూ కోర్టు తీర్పును ఇచ్చింది.

Read more : వర్షిత కేసులో సంచలన తీర్పు: ఉరిశిక్ష విధించిన చిత్తూరు కోర్టు