70 year woman : 70 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చిన మహిళ..పెళ్లైన 45 ఏళ్లకు మాతృత్వపు మధురిమలు

పెళ్లి అయి 45 ఏళ్లకు 70 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చింది ఓ మహిళ.

10TV Telugu News

Gujarat 70 year old woman gave birth : వివాహం అయిన ప్రతీ మహిళా తల్లి కావాలని ఆశపడుతుంది. కానీ బిడ్డలకు పుట్టకపోతే ఆమెను సమాజం గొడ్రాలు అంటూ వేధిస్తుంది. కానీ పాపం ఆమె మాత్రం ఏం చేస్తుంది. సూటిపోటీ మాటలు విని కుమిలిపోవటం తప్ప. పెళ్లి అయి సంత్సరాలు దశాబ్దాలుగా మారిపోతున్న పొత్తిళ్లలోకి చంటిబిడ్డ జాడే లేకపోతే ఆమె పడే వేదన అంతా ఇంతా కాదు. ఇక బిడ్డలు పుట్టరు అని అనుకునే సమయంలో అదీ 70 ఏళ్ల వయస్సులో గర్భవతి అయితే..తనకు కూడా ఓ బిడ్డ పుడతాడని తెలిస్తే ఇక ఆమె ఆనందం అంబరాన్ని తాకకుండా ఉంటుందా? అదే ఆనందాన్ని అనుభవించింది గుజరాత్ లోని ఓ మహిళ. వివాహం జరిగి 45 ఏళ్లు అయ్యింది. ఇంతకాలం బిడ్డల కోసం పరితపించిపోయింది. ఎంతోమంది దేవుళ్లకు ఎన్నో మొక్కులు.అయినా కడుపు పండలేదు. కానీ తన 70 ఏళ్ల వయస్సులో పెళ్లైన 45 ఏళ్లకు కడుపు పండింది. 70 ఏళ్ల వయస్సులో బిడ్డకు జన్మనిచ్చి ఆ బిడ్డను చూసుకున్న తరువాత ఆమె ఆనందంగా అంతా ఇంతాకాదు. మాటల్లో చెప్పలేని ఆనందాన్ని మనసారా ఆస్వాదిస్తోంది ఆ వద్ధ తల్లి..

Read more : WoW‘eBaby’ : వీర్యాన్ని ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ చేసి..బిడ్డకు జ‌న్మ‌నిచ్చిన మ‌హిళ‌..!!

వివాహమైన 45 ఏళ్ల తర్వాత 70 ఏళ్ల వయసులో ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఫలితంగా ప్రపంచంలోనే అతి పెద్ద వయసులో తల్లి అయిన అతి కొద్దిమంది మహిళల జాబితాలో చోటు సంపాదించుకుంది.గుజరాత్‌లోని మోరా గ్రామానికి చెందిన జివెన్‌బెన్ రబరి అనే మహిళకు 70 ఏళ్లు. ఆమె భర్త పేరు మల్దారి. ఆయన వయసు 75 సంవత్సరాలు. వారికి వివాహం జరిగి 45 ఏళ్లు అయ్యింది. కానీ పిల్లలు పుట్టలేదు. పిల్లల కోసం రబరి దంపతులు మొక్కని దేవుడు లేడు. ఎన్నో ఉపవాసాలు. పూజలు. ఎన్నో ఎన్నెన్నో. ఎవరు ఏది చెబితే అది చేసేవారు. కానీ పిల్లలు పుట్టనే లేదు. దీంతో..రబరి దంపతులు ఏ జన్మలో ఏం పాపం చేశామో..ఈ జన్మలో ఇలా పిల్లలు లేనివారిగా క్షోభ అనుభవిస్తున్నాం అనుకుంటు కుమిలిపోయేవారు. కానీ వారి ఆశలు అడియాశలు కాలేదు. టెక్నాలజీ వారిని తల్లిదండ్రుల్ని చేసింది.

Read more : Woman Gave Birth: ఒకే కాన్పులో 9 మందికి జన్మనిచ్చిన మహిళ

మాతృత్వపు మధురిమల కోసం అల్లాడిపోతున్న జివెన్‌బెన్ చివరికి ఐవీఎఫ్ ద్వారా సాకారమైంది. నిజానికి ఈ వయసులో పిల్లల్ని కనడం దాదాపు అసాధ్యమని అనుకున్న ఆ దంపతులకు డాక్టర్ నరేశ్ భానుశాలి ధైర్యం చెప్పారు. ఆశ పడటంలో తప్పులేదు..ప్రయత్నం చేయటంలో అంతకంటే తప్పులేదు. పైగా జివెన్‌బెన్ కుటుంబంలో చాలా మంది లేటు వయసులోనే పిల్లల్ని కన్నారని చెప్పడంతో డాక్టర్ నరేశ్ భానుశాలి తను అనుకున్నది జరిగి తీరుతుందని నమ్మారు. అలా జివెన్ బెన్ కు ధైర్యం చెప్పారు. అలా రబరి దంపతుల కలను సాకారం చేశారు. కాగా..తాను చూసిన వాటిలో ఇదే అత్యంత అరుదైన ఘటన అని డాక్టర్ నరేశ్ తెలిపారు.

Read more : Visakhapatnam : ప్రమాదంలో ఇద్దరు కూతుళ్లు చనిపోయిన రోజే..ఆడకవలకు జన్మనిచ్చిన తల్లి

కాగా..70 ఏళ్లు కావటంతో రబరి గర్భాశయం కుంచించుకుపోయింది. దీంతో డాక్టర్లు ఆమె గర్భసంచిని విస్తరించేలా చేశారు. అలా ఆమె గర్భంలో పిండాన్ని ఉంచారు. అలా నిరంతరం శిశువు పరిస్థితి ఎలా ఉందో పరీక్షలు చేస్తు పరిశీలించేవారు. కానీ డాక్టర్లే ఆశ్చర్యపడేలా రబరి గర్భంలో శిశువు ఎటువంటి సమస్యలు లేకుండా చక్కగా పెరిగింది. అలా నింరతం అబ్జర్వ్ చేస్తు శిశువు ఎదుగుదల..గుండె చప్పుడు ఇలా అన్నీ పరిశీలించేవారు. అలా ఎట్టకేలకు రబరికి నెలలు నిండిన తరువాత ప్రసవం చేశారు.తల్లీ బిడ్డలు పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారని డాక్టర్ నరేశ్ భానుశాలి వెల్లడించారు.