9 Year Old Girl Jain Monk : తొమ్మిదేళ్లకే జైన సన్యాసం తీసుకున్న వజ్రాల వ్యాపారి కూతురు

 సన్యాసం అనే మాటకు అర్థం కూడా తెలియని పసి వయస్సు. ఓ వజ్రాల వ్యాపారికి ముద్దుల కూతురు. కోట్ల రూపాయలకు వారసురాలు. ఓ తొమ్మిదేళ్ల చిన్నారి జైన మతం స్వీకరించింది. సన్యాసినిగా మారిపోయింది గుజరాత్ లోని సూరత్ కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి గారాల పట్టి.

9 Year Old Girl Jain Monk : తొమ్మిదేళ్లకే జైన సన్యాసం తీసుకున్న వజ్రాల వ్యాపారి కూతురు

9 Year Old Girl Jain Monk

9 Year Old Girl Jain Monk :  సన్యాసం అనే మాటకు అర్థం కూడా తెలియని పసి వయస్సు. ఓ వజ్రాల వ్యాపారికి ముద్దుల కూతురు. కోట్ల రూపాయలకు వారసురాలు. ఓ తొమ్మిదేళ్ల చిన్నారి జైన మతం స్వీకరించింది. సన్యాసినిగా మారిపోయింది గుజరాత్ లోని సూరత్ కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి గారాల పట్టి. కోట్లకు అధిపతి అయిన వజ్రాల వ్యాపారి ముద్దుల కూతురు జైనాచార్య చేతుల మీదుగా సన్యాసం తీసుకుంది. బుధవారం (జనవరి 18,2023) సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి సంఘ్వీ మోహన్‌భాయ్ మనవరాలు దేవాన్షీ వేలాదిమంది సమక్షంలో దేవాన్షీ. వేలాదిమంది సమక్షంలో జైనమనం స్వీకరించిన దేవాన్షీ తెల్లని వస్త్రాలు ధరించిన దేవదూతలా ఉంది.

సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి ధనేష్ సంఘ్వీ‌-అమీ దంపతుల పెద్ద కుమార్తె దేవాన్షి బుధవారం ఉదయం 6 గంటలకు జైన సన్యాసం స్వీకరించింది. దేవాన్షి తండ్రి ధనేష్ సంఘ్వీ 30 ఏళ్ల నుంచి వజ్రాల వ్యాపారం చేస్తున్నారు. మూడు రోజులుగా సూరత్ లో జరుగుతున్న జైన కార్యక్రమాల్లో భాగంగా జైనాచార్య కీర్తియాశ్సూరీశ్వర్‌ మహరాజ్‌ సమక్షంలో దేవాన్షీ దీక్ష తీసుకుంది. ఈ చిన్నారి దీక్షా కార్యక్రమాన్ని వీక్షించేందుకు సూరత్‌, పరిసర గ్రామాల నుంచి దాదాపు 35 వేల మంది తరలివచ్చారు. దేవాన్షీ వర్షిదన్‌ యాత్ర సూరత్‌లోనే జరిగింది.

ఈ యాత్రలో 4 ఏనుగులు, 20 గుర్రాలు, 11 ఒంటెలు పాల్గొన్నాయి. అంతకుముందు దేవాన్షీ వర్షిదన్‌ యాత్ర ముంబై, ఆంట్‌వెర్ప్‌లో కూడా జరిగింది. పసి వయస్సు నుంచి ఆధ్యాత్మిక జీవితం అంటే ఇష్టపడే దేవాన్షి 5 భాషల్లో పరిజ్ఞానం ఉంది. అంతేకాదు పలు కళల్లో నేర్పరి కూడా. సంగీతం అంటే ప్రాణం. స్కేటింగ్‌, మెంటల్‌ ఎబిలిటీ మ్యాథ్స్‌, భరతనాట్యంలో ప్రావీణ్యురాలు. వైరాగ్య శతకం, తత్వార్థ అధ్యాయ్‌ వంటి గ్రంథాలను కంఠస్థం చేసిన ఘనత కలిగిన చిన్నారి దేవాన్షి.

చిన్ననాటే జైన దీక్ష తీసుకున్న కూతురు గురించి ధనేష్ దంపతులు మాట్లాడుతూ..నా కూతురు జైన మతంలో నిషేధించిన వాటిని ఏనాడూ ఉపయోగించలేదని..కనీసం టీవీ కూడా చూడలేదని తెలిపారు. మత సంబంధ పరిజ్ఞానంతో పాటు క్విజ్‌లో ఎప్పుడూ దేవాన్షీదే ఫస్ట్ వచ్చేదని..జైన మతం ఆచారాలు, వ్యవహారాలు, పద్ధతులపై పసివయస్సు నుంచి అవగాహన పెంచుకుందని..చిన్ననాటే నా కూతురు సన్యాస దీక్ష తీసుకోవడం మా కుటుంబం చేసుకున్న అదృష్టమని అమీబెన్‌, ధనేష్‌ తెలిపారు.