PM Modi: అహ్మదాబాద్ లో 4 లక్షల మందితో ప్రధాని మోదీ భారీ రోడ్ షో

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో.. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో.. విజయానికి ప్రతీకగా మోదీకి గౌరవ వందనం సమర్పించాలని పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు

PM Modi: అహ్మదాబాద్ లో 4 లక్షల మందితో ప్రధాని మోదీ భారీ రోడ్ షో

Modi

PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం నేడు గుజరాత్ చేరుకోనున్నారు. శుక్ర శనివారాల్లో అహ్మదాబాద్ లో నిర్వహించే పార్టీ కార్యక్రమాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొననున్నారు. మోదీ రాకను పురష్కరించుకుని గుజరాత్ బీజేపీ నేతలు భారీ రోడ్డు షో నిర్వహించనున్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో.. నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో.. విజయానికి ప్రతీకగా మోదీకి గౌరవ వందనం సమర్పించాలని పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయం అహ్మదాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న మోదీ అక్కడి నుంచి నేరుగా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటారు.

Also read: Final Election Results : ఇది బీజేపీ దండయాత్ర.. 5 రాష్ట్రాల ఎన్నికల ఫైనల్ రిజల్ట్స్ ఇవే..

ప్రధాని మోదీకి సాదర స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తుంది. రోడ్డు షోలో సుమారు నాలుగు లక్షల మంది పాల్గొంటారని నేతలు భావిస్తున్నారు. పార్టీ కార్యాలయానికి చేరుకున్న అనంతరం ఎమ్మెల్యేలు, ఎంపీలతో మోదీ సమావేశం అవుతారు. అనంతరం సాయంత్రం జీఎండీసీ గ్రౌండ్ లో జరిగే “మారు గ్రామ్ – మారు గుజరాత్” మహా పంచాయత్ సమ్మేళనంలో పాల్గొని.. ఇటీవల ఎన్నికైన 1.38 లక్షల మంది స్థానిక సంస్థల ప్రతినిధుల నుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఈ ఏడాది చివరలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులకు మోదీ దిశా నిర్దేశం చేయనున్నారు.

Also read: BJP 273 : యూపీలో కమల వికాసం… 273 సీట్లు కైవసం

నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ భారీ విజయం నమోదు చేయడం, ప్రతిపక్ష పార్టీల అడ్రెస్ గల్లంతవడంతో గుజరాత్ లోనూ భారీ విజయం సాధించే దిశగా ఇప్పటి నుంచే బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇక శనివారం జరగనున్న పలు సాంస్కృతిక, ఆటల పోటీలకు మోదీ హాజరవుతారు. ఇటీవల నిర్మించిన సర్ధార్ పటేల్ స్టేడియంలో గుజరాత్ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే “ఖేల్ మహాకుంభ్” కార్యక్రమానికి మోదీ హాజరౌతారు. ఈ క్రీడల ప్రారంభోత్సవం సందర్భంగా 1100 మంది సాంస్కృతిక కళాకారులతో ప్రదర్శనలు నిర్వహించనున్నారు.