Honey Trap: అయ్యో పాపం..! సెక్స్‌టార్షన్ ఉచ్చులో పడి రూ. 2.69కోట్లు పోగొట్టుకున్న వ్యాపారి

గుజరాత్‌ వ్యాపారవేత్తకు గత ఏడాది ఆగస్టు 8న మోర్చీకి చెందిన రియా శర్మ అనే మహిళ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. వీరిమధ్య పరిచయం పెరగడంతో.. న్యూడ్ వీడియో కాల్ ద్వారా మాట్లాడుకున్నారు. అయితే, వ్యాపారి న్యూడ్ వీడియోను అడ్డుపెట్టుకొని బెదిరించి డబ్బులు వసూళ్లు చేసింది. అలా ఆమెను అడ్డుపెట్టుకొని మరికొందరు ఫోన్ చేసి వ్యాపారిని బెదిరించారు. ఇలా రూ. 2.69 కోట్లు సొమ్మును దోచుకున్నారు.

Honey Trap: అయ్యో పాపం..! సెక్స్‌టార్షన్ ఉచ్చులో పడి రూ. 2.69కోట్లు పోగొట్టుకున్న వ్యాపారి

Sex Video Call Trap

Honey Trap: ఓ వ్యాపారి సెక్స్‌టార్షన్ ఉచ్చులో పడి రూ. 2.69 కోట్లు పోగొట్టుకున్నాడు. జనవరి 10న సైబర్ క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. గుజరాత్‌లో పునరుత్పాదక ఇంధన సంస్థ నడుపుతున్న వ్యాపారవేత్తకు గత ఏడాది ఆగస్టు 8న మోర్చీకి చెందిన రియా శర్మ అనే మహిళ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. వీరిమధ్య పరిచయం మరింత పెరగడంతో.. యువతి సదరు వ్యాపారవేత్తను బట్టలు విప్పించి న్యూడ్‌గా వీడియో కాల్ మాట్లాడేలా చేసింది. అయితే, మూడురోజుల తరువాత యువతి తనకు రూ.50వేలు కావాలని వ్యాపారవేత్తను అడిగింది. అందుకు బాధితుడు ససేమీరా అనడంతో న్యూడ్ వీడియో క్లిప్ ను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించింది.

Kurnool Honey Trap : అర్థరాత్రి అమ్మాయిల నుంచి న్యూడ్ వీడియో కాల్స్.. టెంప్ట్ అయ్యారో ఖతమే

యువతి బెదిరింపులకు లొంగిపోయిన వ్యాపారవేత్త అడిగిన సొమ్ముకు చెల్లించుకున్నాడు. మరుసటి రోజే గుండు శర్మ అనే పేరుతో ఓ వ్యక్తి బాధితుడికి ఫోన్ చేశాడు. నేను ఢిల్లీ పోలీస్ ఇన్ స్పెక్టర్ ను అని, నీ న్యూడ్ వీడియో నా వద్ద ఉంది.. నాకు రూ. 3లక్షలు ఇవ్వకుంటే వీడియోను వైరల్ చేస్తానని బెదిరించాడు. బాధితుడు భయపడి అతను అడిగిన సొమ్మును ఇచ్చేశాడు. ఇక సమస్య తీరిపోయిందని భావించాడు. కానీ, మరుసటి రోజు. నీ వల్ల యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. డిసెంబర్ 14న రూ. 80.97లక్షలు చెల్లించాలని, లేకుంటే యువతి చనిపోతుందంటూ భయపెట్టడంతో అడిగిన సొమ్మును చెల్లించుకున్నాడు.

 

సీబీఐ అధికారులమని మరోసారి ఫోన్ చేశారు.. యువతి తల్లి కేంద్ర దర్యాప్తు సంస్థను ఆశ్రయించింది. కేసును పరిష్కరించేందుకు రూ.8.5లక్షలు డిమాండ్ చేశారు. చేసేదేమీలేక బాధితుడు ఆ మోత్తాన్ని చెల్లించుకున్నాడు. చివరకు డిసెంబర్ 15న ఢిల్లీ హైకోర్టు కేసును క్లోజ్ చేస్తుంది, కొంతమొత్తాన్ని చెల్లించాలని చెబుతూ అందుకు సంబంధించిన ఉత్తర్వులు పంపించారు. అయితే అవి ఫేక్ ఉత్తర్వులుగా అనుమానం రావడంతో మోసపోయానని గమనించిన వ్యాపారి.. జనవరి 10న సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. ఏకంగా 11మందికి రూ. 2.69 కోట్లు చెల్లించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.