Black Fungus : ఇల్లు అమ్మేసి బ్లాక్ ఫంగస్ చికిత్స..ఐదు నెల‌ల్లో ఆరు ఆపరేషన్లు..రూ.55లక్షలకు పైగా ఖర్చు..

Black Fungus : ఇల్లు అమ్మేసి బ్లాక్ ఫంగస్ చికిత్స..ఐదు నెల‌ల్లో ఆరు ఆపరేషన్లు..రూ.55లక్షలకు పైగా ఖర్చు..

Gujarath Man Black Fungus..six Oparations For Five Mounths

Gujarat Businessman Vinal  black fungus  : దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు కరోనా నుంచి కోలుకున్నవారు బ్లాక్ ఫంగ‌స్ బారిన ప‌డుతున్నారు. దేశంలో బ్లాక్ ఫంగ‌స్ కేసుల‌ సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ ఫంగస్ తో బాధపడేవారు..తిరిగి ఆసుపత్రులకు చేరుతున్నారు. ఈ బ్లాక్ ఫంగస్ కు చికిత్స చేయించుకోవాలంటే లక్షల రూపాయలు ఖర్చు అవుతుందంటున్నారు నిపుణులు. ఆ స్తామత లేని వారి పరిస్థితి ఏంటీ అనే భయం వెన్నాడుతోంది. ఈక్రమంలో గుజరాత్ కు చెందిన ఓ వ్యాపారి కరోనా నుంచి కోలుకున్నాక బ్లాక్ ఫంగస్ బారిని పడ్డాడు. దీంతో భర్తను బ్రతికించుకోవటానికి అతని భార్య ఏకంగా ఇల్లు అమ్మేసి చికిత్స చేయించుకుంటున్న పరిస్థితి వచ్చింది. ఇప్పటికే అతనికి ఆరు ఆపరేషన్లు చేశారు డాక్టర్లు, ఇంకా ఆపరేషన్లు చేయాల్సిన అవసం ఉందంటున్నారు. బ్లాక్ ఫంగస్ వైద్యానికి ఇప్పటికే 40లక్షల ఖర్చు కాగా మరో 15 లక్షలు ఖర్చు అవుతుందంటున్నారు.

గుజరాత్ లో ని రాజ్ కోట్ కు చెందిన విమల్ దోషి అనే వ్యాపారికి కరోనా సోకింది. కొంతకాలానికి కోలుకున్నాడు. కానీ బ్లాక్ ఫంగస్ వల్ల మరోసారి ఆసుప్రతిపాలయ్యాడు విమల్. ఐదు నెలలుగా బ్లాక్ ఫంగ‌స్‌తో పోరాడుతున్న విమల్‌లో ఇన్‌ఫెక్షన్ చాలా వేగంగా పెరుగుతోంది. దీంతో డాక్టర్లు ఎప్పటికప్పుడు ఆపరేషన్లు చేస్తున్నారు. అలా విమల్‌కు ఇప్పటివరకు ఇన్ ఫెక్షన్ తగ్గటానికి 39 ఇంజెక్షన్లు ఇచ్చారు. ఆరు ఆపరేషన్లు చేశారు. త్వ‌ర‌లో మరో ఆపరేషన్ చేయాలంటున్నారు. దీంతో లక్షలాది రూపాయలు నీళ్లల్లా ఖర్చు కావటంతో విమల్ భార్య చాందిని వారి ఇల్లు అమ్మేయాల్సి వచ్చింది.

భర్తను బతికించుకోవాలంటే ఇల్లు అమ్మేయక తప్పలేదని వాపోయింది విమల్ భార్య చాందిని. తన భర్త వ్యాపారం కోసం అహ్మదాబాద్‌లో ఉంటార‌ు. 2020 నవంబర్‌లో భ‌ర్త‌కు కరోనా సోకింది. 15 రోజుల పాటు చికిత్స పొందార‌ు. కరోనా సోకిన సమయంలో నా భర్తకు ఆక్సిజన్‌తోపాటు స్టెరాయిడ్స్ ఇచ్చార‌ు. ఆ తరువాత త‌న భ‌ర్త‌కు ముక్కులో ఫంగస్ ఉన్నట్లుగా తేలింది.

దీంతో త‌న భ‌ర్త‌ ఆనంద్ మెడికల్ కాలేజీలో ఆపరేషన్ చేయించుకోగా..త‌రువాత ఫంగస్ కంటికి కూడా చేరిందని తెలియగా మరోసారి ముక్కు దగ్గర మరో ఆపరేషన్ చేశారు. అక్కడితో బ్లాక్ ఫంగస్ పరంపర మెదడుకు చేరుకుందని డాక్టర్లు తెలిపారు. ఇప్పటి వరకూ నా భర్తకు ఆరు ఆపరేషన్లు చేశారు. ఇప్పుడు న్యూరో సర్జరీ చేయాలని డాక్టర్లు తెలిపారని..ఆలా ఆపరేషన్లకు..చికిత్సల కోసం ఇల్లు అమ్మేశామని తెలిపారు. ఇప్పటివరకూ 41 లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయి. మ‌రో 10 నుంచి 15 లక్షలు అవసరం ఉంద‌ని..వాపోయారు చాందిని. ఇప్పటి వరకూ నా భ‌ర్త‌కు నాలుగు లాప్రోస్కోపీలు, ఒక ఫోర్‌హెడ్‌ ఆపరేషన్, మెదడుకు ఆపరేషణ్ జరిగాయ‌ని తమ పరిస్థితిని వివరించారు చాందిని. ఇన్ని పాట్లు పడ్డాక తన భ‌ర్త పూర్తిగా కోలుకున్న‌డ‌ని సంతోషిస్తున్న సమయంలో మెదడులో ఇన్ఫెక్షన్ ఉంద‌ని డాక్టర్లు చెప్పారని ఇప్పుడు దాని కోసం మరో 10నుంచి 15 లక్షలు ఖర్చు అవుతాయని తెలిపారు.