Gujarat Election Counting 2022 : గుజరాత్ ఎన్నికల ఫలితాలు చూసి..బీఆర్ఎస్ వీఆర్ఎస్ తీసుకోవాల్సిందే : జీవీఎల్

గుజరాత్ ఎన్నికల ఫలితాలు చూసి..బీఆర్ఎస్ వీఆర్ఎస్ తీసుకోవాల్సిందే అంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ సీఎం కేసీఆర్ పై సెటైర్లు వేశారు.

Gujarat Election Counting 2022 : గుజరాత్ ఎన్నికల ఫలితాలు చూసి..బీఆర్ఎస్ వీఆర్ఎస్ తీసుకోవాల్సిందే : జీవీఎల్

BJP MP GVL satires on CM KCR

Gujarat Election Counting 2022 : గుజరాత్ ఎన్నికల ఫలితాలు చూసి..బీఆర్ఎస్ వీఆర్ఎస్ తీసుకోవాల్సిందే అంటూ బీజేపీ ఎంపీ జీవీఎల్ సీఎం కేసీఆర్ పై సెటైర్లు వేశారు. బీజేపీని అణచివేస్తామని..తెలంగాణలో కాషాయపార్టీని నామరూపాలు లేకుండా చేస్తామని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ కు గుజరాత్ లో బీజేపీ హవా చూస్తే నిద్రపట్టదంటూ ఎద్దేవా చేశారు. ఇది బీజేపీ పార్టీ అంటే ఇప్పటికైనా కేసీఆర్ తెలుసుకోవాలని..అహంకారంతో మాట్లాడటం కేసీఆర్ తగ్గించుకోవాలంటూ సూచించారు. గుజరాత్ లో బీజేపీ మరోసారి తన సత్తాను చాటుతున్న క్రమంలో ఇక బీజేపీ గెలుపు ఖాయమైంది. ఈ క్రమంలో జీవీఎల్ సీఎం కేసీఆర్ పై సెటైర్లు వేశారు.

ముందస్తు ఎన్నికలకు వెళతామంటూ కేసీఆర్ దూకుడుకు కచ్చితంగా గుజరాత్ ఎన్నికల ఫలితాలు చెక్ పెడతాయని అన్నారు జీవీఎల్. గుజరాత్ లో బీజేపీ హవా చూసిన.. కేసీఆర్ ..ఇప్పుడు చెప్పండీ ముందస్తు ఎన్నికలు వెళతామని..అలా చెప్పే దమ్ము ఉందా? అంటూ ఛాలెంజ్ చేశారు జీవీఎల్. ప్రస్తుతం గుజరాత్ లో బీజేపీ గెలుపు చూసిన కేసీఆర్ ముందుస్తు ఎన్నికలకు వెళతారో లేదో చెప్పాలంటూ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ ను ఓడించి బీజేపీ గెలవటం ఖాయం అంటూ జీవీఎల్ ధీమా వ్యక్తంచేశారు. ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించిన అంశంపై కూడా జీవీఎల్ తనదైనశైలలో సెటర్లు వేస్తూ… బీఆర్ఎస్ కాదు వీఆర్ఎస్ తీసుకోల్సిందేనంటూ ఎద్దేవా చేశారు.

కాగా..గుజరాత్ లో బీజేపీ మరోసారి తన సత్తాను చాటుతోంది. గుజరాత్ లో మొత్తం 182 సీట్లకు గానీ 155 సీట్లలో బీజేపీ దూసుకుపోతోంది. ఇక గెలుపు నామమాత్రమే. గుజరాత్ లో త్రిముఖ పోటీ ఉన్నాకూడా బీజేపీ హవామాత్రం ఏమాత్ర తగ్గలేదు. దీనికి నిదర్శనమే ఇప్పుడు బీజేపీ దూసుకుపోతున్న తీరు. గత ఎన్నికలతో పోల్చితే బీజేపీకి గుజరాత్ లో సీట్లు పెరిగాయి. 155 స్థానాల్లో కాంగ్రెస్ గానీ..ఆప్ గానీ అందుకోలేని స్థాయిలో ఉంది. కాంగ్రెస్ కేవలం 20 ప్రాంతాల్లో ఊగిసలాడుతోంది. ఇక ఆప్ కేవలం 6 స్థానల్లో మాత్రమే ఉంది. కానీ బీజేపీ మాత్రం 155 ప్రాంతాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది. ఇక గెలుపు బీజేపీ ఖాయమైంది.