ఎకో ఫ్రెండ్లీ: రూ.100 కే సోలార్ కుక్కర్!

  • Published By: veegamteam ,Published On : September 5, 2019 / 07:29 AM IST
ఎకో ఫ్రెండ్లీ: రూ.100 కే సోలార్ కుక్కర్!

సోలార్ కుక్కర్..దీని  మహిమ అంతా ఇంతా కాదు. ఏదైనా పనిమీద బయటకు వెళ్లాలనుకుంటే..వెళ్లే ముందు ఈ సోలార్ కుక్కర్ లో బియ్యం..తగినన్ని నీళ్లు పోసేసి వెళ్లిపోతే మీరు ఇంటికి వచ్చేసరికి చక్కగా తినటానికి వేడి వేడిగా పొగలు కక్కే అన్నం రెడీ అయిపోతుంది. కేవలం కేవలం రూ.100 ఖర్చుతోనే ఇది సాధ్యం. అంతే కాదు ఈ సోలార్ కుక్కర్ ను ఎవరైనా తయారు చేసుకోవచ్చు..గుజరాత్ లోని రిమోట్ గ్రామాల్లోని వందలాది మంది గిరిజనులు ఈ సోలార్ కుక్కర్ తోనే వంట చేసుకుంటున్నారు.  

గ్యాస్ తో పనిలేదు..వేలకు వేలు ఖర్చుకాదు..వంట కోసం చెట్లను నరకాల్సిన పని అసలే లేదు. ఈ సోలార్ కుక్కర్ ఒకటి ఉంటే చాలు.చక్కటి వంట సిద్ధమైపోతుంది. ఈ సోలార్ కుక్కర్ ను గుజరాత్ కు చెందిన ఇంజినీర్ అల్జుబెర్ సయ్యద్ కు కనిపెట్టారు. కట్టెల పొయ్యితో వంటలు చేస్తున్న గిరిజనుల మహిళలకు అనారోగ్యాలకు గురవుతున్నారు. వారి చూసిన సయ్యద్ కాలుష్యం కానీ..పర్యావరణానికి హానీ జరగని సోలార్ కుక్కర్ ను తయారు చేశారు.

సోలార్ కుక్కర్ ను తయారు చేశాక సయ్యద్ గుజరాత్ లోని పలు గిరిజన గ్రామాల్లో క్యాంపెయిన్ ప్రారంభించారు. ఎండను ఎలా ఉపయోగించుకుని సోలార్ కుక్కర్ తో వంట ఎలా చేసుకోవచ్చే గ్రామాల్లోని మహిళలకు వివరించారు. ఇప్పటి వరకు గుజరాత్ లోని పంచ్ మహల్, నర్మదా, జామ్ నగర్, జెట్ పూర్ లాంటి ప్రాంతాల్లో 100 గ్రామాల్లో సయ్యద్ 2016 పర్యటించి అక్కడి ప్రజలకు సోలార్ కుక్కర్ గురించి తెలియజేశారు. దీనిపై అవగాహన పెంచుకున్న గిరిజన మహిళలు ఇప్పడు సోలార్ కుక్కర్ తోనే వంట చేసుకుంటున్నారు. 
ఈ కుక్కర్ ను తయారు చేసిన సయ్యద్ దాన్ని వ్యాపారం చేయలేదు.కేవలం రూ.100కే సోలార్ కుక్కర్ ను ఎలా తయారు చేసుకోవాలో గిరిజనులకు తెలిపాడు. దాన్ని తయారు చేసుకున్నవారు చక్కగా వంట చేసుకునేలా చేశారు సయ్యద్. 

సోలార్ కుక్కర్ ను తయారు చేసుకునే విధానం..కావాల్సిన వస్తువులు 
కార్డ్ బోర్డ్, అల్యూమినియం రేకు, బట్టలకు పెట్టే పిన్, ఐడీ కార్డు కోసం వాడే దారం లాంటిది ఉంటే చాలు. ఒక గిన్నె(అల్యూమినియం లేదా స్టీల్) ను తీసుకొని… దాని బయట బ్లాక్ కలర్ పెయింట్ వేయాలి. ఎండ వేడిని ఎక్కువగా గ్రహించడం కోసం బ్లాక్ కలర్ పెయింట్ వేయాలి. అంతే… అల్యూమినియం రేకులో గిన్నెను పెట్టి… దాన్ని ఎండకు పెట్టి.. మనకు కావాల్సిన వంటకాలను వండుకోవడమే. దీన్ని తయారు చేయడానికి 100 రూపాయల వరకు మాత్రమే ఖర్చు అవుతుంది. దాని తయారీకి కావాల్సిన వస్తువులన్నీ ప్రతి ఇంట్లో ఉండేవే. సోలార్ కుక్కర్ ద్వారా పప్పు, అన్నం, కూర, డోక్లా, హండ్వా, కేక్ లాంటివి వండుకోవచ్చు.

ఆరుగురు వ్యక్తులున్న కుటుంబానికి వంట చేయాలంటే 3 గంటలు పడుతుంది. ఈ కుక్కర్ ను ఒకసారి దీన్ని తయారు చేసుకుంటే సంవత్సరానికి పైగా వాడుకోవచ్చు.పెద్దలే కాదు చిన్న పిల్లలు కూడా ఈజీగా సోలార్ కుక్కర్ లో వంట చేసేయొచ్చు. 

గిరిజన మహిళల కోసం పర్యావరణ హితమైన సోలార్ కుక్కర్ ను తయారు చేసినందుకు..సయ్యద్ కు 2018 లో ఇంటర్నేషనల్ వాలంటీర్ డే రోజున యూఎన్ వీ అవార్డు 2018 దక్కింది. అంతేకాదు..గాంధీ గ్లోబల్ సోలార్ జర్నీ సెంటర్ లో సోలార్ ఏంజెల్ గా సయ్యద్ ఎంపికయ్యారు.