గుజరాత్ లో పండుగలు, ఉత్సవాలపై నిషేధం

  • Published By: madhu ,Published On : August 8, 2020 / 10:44 AM IST
గుజరాత్ లో పండుగలు, ఉత్సవాలపై నిషేధం

కరోనా వైరస్ ఇంకా తగ్గుముఖం పట్టకపోతుండడంతో ఆగస్టు నెల నుంచి ప్రారంభం కానున్న పండుగలు, ఇతర కార్యక్రమాలపై గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫెస్టివల్స్, బహిరంగంగా, సామూహికంగా నిర్వహించే వేడుకలను నిషేధం విధించిదని రాష్ట్ర హోం మంత్రి ప్రదీప్ సింగ్ జడేజా ప్రకటించారు.



పండుగలు, వివిధ కార్యక్రమాలపై నిర్ణయం తీసుకోవాలని Padyatra Sangh, service camps, Ganpati Festival associations తో పాటు వివిధ సంస్థలు వినతిపత్రాలు సమర్పించాయి. ఈ క్రమంలో హోం మంత్రి ప్రదీప్ నిర్ణయం తీసుకున్నారు.

మతపరమైన కార్యక్రమాలు, బహిరంగ వేడుకలు నిర్వహించవద్దని ప్రజలకు ప్రభుత్వం సూచించింది. అ అలాగే వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసే గణపతి విగ్రహాలను బహిరంగంగా ఏర్పాటు చేయవద్దని వ్యాపారులకు సూచించారు. ఇంట్లోనే మట్టి విగ్రహాలు ఏర్పాటు చేసుకుని సామాజిక దూరం పాటిస్తూ…పూజలు చేసుకోవాలని సూచించారు.



గుజరాత్ లో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 22 మంది కరోనాతో చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 2 వేల 606కు చేరుకుంది. తాజాగా 26 వేల 591 మందికి కరోనా పరీక్షలు చేయగా..వేయి 074 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.

దీంతో మొత్తం కేసు సంఖ్య 68 వేల 885కు చేరుకుంది. అహ్మదాబాద్‌లో అత్యధికంగా 1630 మంది, సూరత్‌లో 486 మంది కరోనాతో మృతి చెందారు. గుజరాత్‌లో మరణాల రేటు 4 నుంచి 3.78 శాతానికి తగ్గింది.