Gujarat Lockdown Guidelines : గుజరాత్‌లో లాక్‌డౌన్ కొత్త మార్గదర్శకాలు.. రెండు వారాలు సడలింపు

రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత తగ్గడంతో గుజరాత్ ప్రభుత్వం రెండు వారాల పాటు లాక్ డౌన్ మార్గదర్శకాలను సడలించింది. జూన్ 11నుంచి జూన్ 26 వరకు సడలింపు ప్రకటించింది.

Gujarat Lockdown Guidelines : గుజరాత్‌లో లాక్‌డౌన్ కొత్త మార్గదర్శకాలు.. రెండు వారాలు సడలింపు

Gujarat Lockdown

Gujarat govt relaxes COVID lockdown guidelines : రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత తగ్గడంతో గుజరాత్ ప్రభుత్వం రెండు వారాల పాటు లాక్ డౌన్ మార్గదర్శకాలను సడలించింది. జూన్ 11నుంచి జూన్ 26 వరకు సడలింపు ప్రకటించింది. అన్ని ఆర్థిక కార్యకలాపాలు కొనసాగేందుకు అనుమతినిచ్చింది. కరోనా కేసుల పెరుగుదల కారణంగా దాదాపు రెండు నెలలు మూతపడ్డాయి. కొత్త మార్గదర్శకాల ప్రకారం.. రాష్ట్రంలో పార్కులు, జిమ్‌లు, గ్రంథాలయాలు, మతపరమైన ప్రదేశాలు తెరవవచ్చు.

హోటళ్ళు, రెస్టారెంట్లు, జిమ్‌లను కూడా 50శాతం సీటింగ్ సామర్థ్యంతో నడపవచ్చు. 60శాతం మంది ప్రయాణీకులతో పట్టణ బస్సు సర్వీసులకు ప్రభుత్వం ఆమోదించింది. అయితే, రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. జూన్ 8, 2021 నాటికి, గుజరాత్‌లో 8.18 లక్షలకు పైగా కోవిడ్ -19 కేసులు & 9,966 మరణాలు నమోదయ్యాయి.

– ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు 50శాతం సామర్థ్యం కలిగిన రెస్టారెంట్లలో భోజనం చేయడానికి అనుమతి ఉంది
– రాత్రి 9 గంటల వరకు టేకావే అనుమతి ఉంటుంది. అర్ధరాత్రి వరకు ఇంటి డెలివరీ.
– జూన్ 11 నుంచి మతపరమైన ప్రదేశాలకు అనుమతి.. 50 కంటే ఎక్కువ మందికి అనుమతి లేదు.
– షాపులు ఉదయం 9 నుంచి 7 గంటల మధ్య తెరవవచ్చు (గంట పొడిగింపు).
– ఉదయం 6 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు పార్కులు తెరవవచ్చు.
– జిమ్‌లు 50శాతం సామర్థ్యంతో పనిచేసుకోవచ్చు.
– సామాజిక, రాజకీయ సమావేశాలలో 50 మందికి మించి ఉండకూడదు.
– గ్రంథాలయాలు 50శాతం సామర్థ్యంతో పనిచేయవచ్చు.
-గుజరాత్ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో IELTS, టాఫెల్ పరీక్షలు జరపాలని నిర్ణయం తీసుకుంది.