రెండో డోస్ తర్వాత కూడా కరోనా

రెండో డోస్ తర్వాత కూడా కరోనా

second dose

Gujarat Man Infected : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ ద్వారా చెక్ పెట్టే ప్రయత్నం జరుగుతున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. భారత్ తో సహా ఇతర దేశాల్లో సెకండ్ వేవ్ విస్తరిస్తూనే ఉంది. భారతదేశంలో ఇప్పటికే ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి కరోనా వ్యాక్సినేషన్ వేసిన సంగతి తెలిసిందే. రెండో దశ టీకా పంపిణీ పలు ప్రాంతాల్లో కొనసాగుతోంది. అయతే..వ్యాక్సినేషన్ మొదటి డోస్ తీసుకున్న తర్వాత..కూడా కొంతమందిలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి. తాజాగా రెండో దఫా టీకా తీసుకున్న తర్వాత.. ఓ వ్యక్తిలో కరోనా వైరస్ ఉండడం కలకలం రేపుతోంది. దీంతో ప్రజలు భయాందోనళలకు గురవుతున్నారు.

గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ ప్రాంతానికి చెందిన ఆరోగ్య కార్యకర్త జనవరి 16న మొదటి డోస్ తీసుకోగా..సెకండ్ డోస్..ఫిబ్రవరి 15న తీసుకున్నారు. తర్వాత ఫీవర్ రావడంతో టెస్టులు నిర్వహించారు వైద్యులు. కరోనా పాజిటివ్ ఉందని నిర్ధారించారు. మెరుగైన వైద్య చికిత్స అనంతరం ఆయన కోలుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు.

కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న అనంతరం యాంటీబాడీస్ అభివృద్ధి చెందడానికి 45 రోజుల సమయం పడుతుందని, కొంతమందిలో మాత్రం యాంటీ బాడీల వృద్ధి మరింత ఆలస్యం కావచ్చని అన్నారు వైద్యులు. వ్యాక్సిన్ వేసుకున్నం కదా..నిర్లక్ష్యంగా..వ్యవహరిస్తే..భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, తప్పనిసరిగా మాస్క్, శానిటైజేషన్, సామాజిక దూరం పాటించాలని వైద్యులు సూచించారు.