లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

క్రికెట్ బెట్టింగ్ పెడుతున్నాడని యువకుడిని నగ్నంగా ఊరేగింపు

Updated On - 3:02 pm, Fri, 4 December 20

Gujarat man cricket betting : క్రికెట్ బెట్టింగ్ లు మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. పలు నేరాలకు పాల్పడేలా చేస్తున్నాయి. ఈక్రమంలో ఓ వ్యక్తి క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్నాడని అతణ్ని ఏకంగా నగ్నంగా చేసి ఊరేగించారు.
ఐదుగురువ్యక్తులు కలిసి అతణ్ని ఎత్తుకుపోయి..బలవంతంగా బట్టలు విప్పించి అనంతరం నగ్నంగా ఊరేగించిన ఘటన గుజరాత్ లోని ఖంభాలియా సిటీలో జరిగింది. దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది పోలీసులు దృష్టికి వెళ్లటంతో సదరు ఐదుగురు వ్యక్తుల్ని పోలీసులు గత మంగళవారం (డిసెంబర్ 1,2020)న అరెస్ట్ చేశారు.డీఎస్పీ హీరేంగ్ర చౌదరి తెలిపిన వివరాల ప్రకారం..ద్వారకాగా జిల్లాలోని ఖంబాలియా సిటీలో 38ఏళ్ల వ్యక్తిని ఐదుగురు కలిసి కిడ్నాప్ చేసి తీసుకుపోయారు.అనంతరం అతడి నుంచి సెల్ ఫోన్ లాక్కుని..కొట్టి..బెదిరించి బట్టలు విప్పించి నగ్నంగా బిజీగా ఉన్న మార్కెట్ వద్దనడిరోడ్డుపై 45 నిమిషాల పాటు ఊరేగించారు. ఆ ఐదుగురు నిందితులు బాధితుడికి దూరపు బంధువులు. పాత కక్షలతోనే వారు ఇలా చేశారని డీఎస్పీ తెలిపారు.


వారిపై కిడ్నాప్..అశ్లీల చర్యలకు పాల్పడటానికి సంబంధించి సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. ఈ కేసును క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు అప్పగించగా వారిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. కాగా సదరు ఐదుగురు నిందితుల్లో ఒకరిపై 2016లో ఓ క్రైమ్ కేసు నమోదు అయ్యిందని తెలిపారు.