ప్రేమికుల దినోత్సవం : భార్యకు ఏ గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా..తెలిస్తే..గ్రేట్ అంటారు

ప్రేమికుల దినోత్సవం : భార్యకు ఏ గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా..తెలిస్తే..గ్రేట్ అంటారు

wife on Valentine’s Day : ఫిబ్రవరి 14. వాలెంటైన్స్ డే, ప్రేమికుల రోజు…ప్రేమికులు ఎంజాయ్ చేసే రోజు. ప్రేమికులకు పెద్ద పండుగ. ప్రేమను తెలపడానికి..వారితో బంధాన్ని కలుపుకొనేందుకు…సరైన రోజే..వాలెంటైన్ డే. తమ వారికి ఏదైనా కానుక ఇవ్వాలని కోరుకుంటుంటారు. నగలు, బంగారం, ఇతరత్రా ఖరీదైన గిఫ్ట్ లు కొని ఇస్తుంటారు. కానీ ఓ భర్త..తన భార్యకు మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు. ఏంటా గిఫ్ట్ అనుకుంటున్నారా…అయితే..ఇది చదవండి…
రీటా పటేల్ (44)కు వినోద్ తో వివాహం జరిగింది. పెళ్లై 23 సంవత్సరాలు అయ్యింది.

అయితే..రీటా కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతోంది. వైద్యులకు చూపించగా..రీటా మూత్ర పిండాలు సరిగ్గా పని చేయడం లేదని తెలుసుకున్నాడు. మూడేళ్లుగా మందులపైనే ఆధార పడి జీవిస్తూ..సంసారాన్ని నెట్టుకొస్తోంది రీటా. అర్థాంగి పడుతున్న బాధ చూడలేకపోయాడు వినోద్. దీంతో ఓ సాహసోపేతమైన నిర్ణయానికి వచ్చాడు. తన కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు అతడి కిడ్నీ కరెక్టుగా సరిపోతుందని వైద్యులు నిర్ధారణకు వచ్చారు.
ప్రేమికుల దినోత్సం రోజున ఆపరేషన్ జరిపించాలని వైద్యులను కోరారు. అహ్మదాబాద్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో ఆపరేషన్ జరగడానికి ఏర్పాట్లు చేశారు.

తన భార్య పడుతున్న బాధ చూడలేకపోయాయని, అందుకే తన కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లు వెల్లడించాడు వినోద్. ప్రతొక్కరూ తన జీవిత భాగస్వామిని గౌరవించాలని..అవసరమైనప్పుడు ఒకరినొకరు సహాయం చేసుకోవాలని సూచించారు. కష్టకాలంలో తనకు సహాయం అందిస్తున్న భర్తకు కృతజ్ఞతలు చెప్పింది రీటా. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నట్లు, భర్త కిడ్నీ దానంతో తామిద్దరం..మళ్లీ జీవిస్తామని..భావోద్వేగంతో వెల్లడించింది. ఆటో ఇమ్యూన్ తో మూత్ర పిండాలు పని చేయడం లేదని, గత మూడేళ్లుగా మందులపైనే ఆధారపడి జీవిస్తోందని వైద్యులు డాక్టర్ సిద్దార్థ తెలిపారు. కిడ్నీ ఇన్ప్ఫ్క్షన్ శరీరంలోకి ఇతర భాగాలకు విస్తరించే ప్రమాదం ఉందని తెలిపారు.