దేశంలో ఫస్ట్ టైమ్ : కారు యజమానికి రూ.27లక్షలు ఫైన్

కేంద్ర ప్రభుత్వం కొత్త వాహన చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టం ప్రకారం ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే భారీగా జరిమానాలు విధిస్తారు. దీనిపై ట్రాఫిక్ పోలీసులు అవగాహన

  • Published By: veegamteam ,Published On : January 9, 2020 / 03:50 AM IST
దేశంలో ఫస్ట్ టైమ్ : కారు యజమానికి రూ.27లక్షలు ఫైన్

కేంద్ర ప్రభుత్వం కొత్త వాహన చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టం ప్రకారం ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే భారీగా జరిమానాలు విధిస్తారు. దీనిపై ట్రాఫిక్ పోలీసులు అవగాహన

కేంద్ర ప్రభుత్వం కొత్త వాహన చట్టం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ చట్టం ప్రకారం ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే భారీగా జరిమానాలు విధిస్తారు. దీనిపై ట్రాఫిక్ పోలీసులు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇంత చేసినా.. కొందరు మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు. దీంతో రూల్స్ బ్రేక్ చేస్తున్న వాహనదారులకు భారీగానే ఫైన్ విధించి చుక్కలు చూపిస్తున్నారు పోలీసులు. తాజాగా ఓ కారు యజమానికి ఏకంగా రూ.27లక్షలు ఫైన్ విధించారు పోలీసులు. కొత్త వాహన చట్టం వచ్చాక ఇంత భారీ ఫైన్ వేయడం ఇదే ఫస్ట్ టైమ్ అంటున్నారు అధికారులు. 

గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో వాహనాలు తనిఖీ చేస్తున్న ట్రాఫిక్ పోలీసులకు.. నంబర్ ప్లేట్, సరైన డాక్యుమెంట్స్ లేకుండా రోడ్డెక్కిన అత్యంత ఖరీదైన స్పోర్ట్స్ కారు పోర్షే 911 కనిపించింది. దీంతో పోలీసులు వాహనదారుడికి రూ. 9.80 లక్షల జరిమానా విధించారు. ఈ కారు ఖరీదు దాదాపు 2 కోట్ల రూపాయలు. ఈ ఘటన 2019 నవంబర్ లో జరిగింది. అప్పట్లో ఇది బిగ్ న్యూస్ అయ్యింది. కట్ చేస్తే.. ఘటన జరిగిన 6 వారాల తర్వాత.. పెనాల్టీ విషయంలో పోలీసులు మరో అప్‌డేట్ ఇచ్చారు. ఫైన్‌ను గుజరాత్ ఆర్టీవో లేటెస్ట్ గా రూ.27.68 లక్షలకు పెంచారు.

ఎంత ఫైన్ వేస్తే మాత్రం మరీ రూ.27.68 లక్షలు ఎలా అవుతుందని డౌట్ రావొచ్చు. జనవరి 7, 2020 నుంచి 2033 ఆగస్టు 28 వరకు మోటార్ బ్యాలెన్స్ ట్యాక్స్ రూపంలో మోటార్ వెహికిల్ ట్యాక్స్ రూ.16 లక్షలు.. దానిపై వడ్డీ రూ.7.68 లక్షలు. పెనాల్టీ లేదా అదనపు ఫీజు రూపంలో మరో రూ.4 లక్షలు.. మొత్తం కలుపుకుంటే.. రూ.27.68 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.

వాహనం నడిపేటప్పుడు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ), ఇన్సూరెన్స్ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ లాంటి బేసిక్ డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలి. ఈ డాక్యుమెంట్లను తీసుకెళ్లడం కష్టమని భావించే వారు డిజీ లాకర్ యాప్ లో వాటిని భద్రపరచుకోవచ్చు. వాటిని తనిఖీ అధికారులకు చూపించొచ్చు. కానీ ఆ డాక్యుమెంట్లేవీ లేకపోవడంతో.. పోర్షే కారు యజమానికి భారీ జరిమానా విధించారు అధికారులు.

Also Read : హక్కులు కాలరాసే పౌరసత్వ చట్టాన్ని రద్దు చేయాలి : హిందువులపై సానుభూతి చూపాల్సిందే