Covid-19 : టీకా వేసుకోనివారికి షాకింగ్ న్యూస్.. బయటకు వస్తే అంతే!

కొవిడ్ టీకా వేయించుకోలేదా? గుజరాత్ ప్రభుత్వం షాకింగ్ న్యూస్ చెప్పింది. టీకా అర్హత ఉన్నప్పటికీ కూడా వ్యాక్సిన్ వేయించుకోనివారి విషయంలో ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది.

Covid-19 : టీకా వేసుకోనివారికి షాకింగ్ న్యూస్.. బయటకు వస్తే అంతే!

Gujarat Restricts Unvaccinated People From Using Public Facilities

Covid-19 : కొవిడ్ టీకా వేయించుకోలేదా? గుజరాత్ ప్రభుత్వం షాకింగ్ న్యూస్ చెప్పింది. టీకా అర్హత ఉన్నప్పటికీ కూడా వ్యాక్సిన్ వేయించుకోనివారి విషయంలో ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. కొవిడ్ టీకా విషయంలో అలసత్వం ప్రదర్శించేవారికి పబ్లిక్ ప్రాంతాల్లో అనుమతి లేదని వెల్లడించింది. ఈ మేరకు గుజరాత్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీకా వేసుకోని 18ఏళ్లు పైబడినవారంతా నిర్దేశిత ప్రాంతాల్లో తిరిగేందుకు అనుమతి లేదని పేర్కొంది. నవంబర్ 12 (శుక్రవారం) నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని తెలిపింది. టీకా ఒక డోసు మాత్రమే తీసుకుని.. రెండో డోసు తీసుకోని వారికి కూడా ప్రజారవాణాలో అనుమతి నిరాకరిస్తున్నట్టు వెల్లడించింది.

లైబ్రరీ, స్విమింగ్ పూల్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ వంటి ప్రదేశాల్లో కూడా వ్యాక్సిన్ వేయించుకోని వారికి అనుమతి లేదని ఉత్తర్వుల్లో పేర్కొంది. పబ్లిక్ ప్రాంతాల్లో ప్రవేశానికి ముందు వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుందని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. గుజరాత్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 7.28 కోట్ల డోసులు పంపిణీ చేశారు. రాష్ట్రంలో మొత్తం 4.09 లక్షల మందికి కోవిడ్ -19 టీకాలు అందాయి. 16,000 గ్రామాలు, ఐదు మునిసిపల్ కార్పొరేషన్లు అర్హతగల జనాభాలో 100శాతం కోవిడ్ -19 వ్యాక్సిన్ మొదటి డోస్‌తో టీకాలు పూర్తయినట్టు ప్రభుత్వ డేటా వెల్లడించింది. భావ్‌నగర్‌, గాంధీనగర్‌, సూరత్‌, జునాగఢ్‌, రాజ్‌కోట్‌ నగరాల్లోని అర్హులైన జనాభా మొత్తానికి తొలి టీకా వేసినట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి రుషికేష్‌ పటేల్‌ తెలిపారు. జునాగఢ్, అహ్మదాబాద్, తాపి మహిసాగర్‌లు కూడా ఇప్పటి వరకు మొదటి డోస్‌కి 100శాతం పూర్తయినట్టు పేర్కొన్నారు.

రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితి :
దాదాపు గత నాలుగు నెలల్లో మొదటిసారిగా.. గుజరాత్‌లో కోవిడ్ -19 కేసుల రోజువారీ సంఖ్య బుధవారం 40 మార్కును దాటింది. ఎలాంటి మరణాలు నివేదించబడలేదు. తాజా కొవిడ్ కేసులతో గుజరాత్‌లో కొవిడ్ బాధితుల సంఖ్య 8,26,826కు చేరుకుంది. రాష్ట్రంలో చివరిసారిగా జూలై 14న ఒక్కరోజులో 40కి పైగా కేసులు నమోదయ్యాయి. అహ్మదాబాద్ నగరంలో 16 కొత్త కేసులు నమోదయ్యాయి, గుజరాత్‌లో రోజులో ఇదే అత్యధికం. సూరత్ ఒకటి, వల్సాద్‌లలో ఐదు, వడోదరలో నాలుగు, జునాగఢ్ ఒకటి, మోర్బి రాజ్‌కోట్‌లలో రెండు ఇన్‌ఫెక్షన్లు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 36 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఇక కొవిడ్ రికవరీల సంఖ్య 8,16,521కి పెరిగింది. రాష్ట్రంలో 215 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read Also :  AP Corona : ఏపీలో కొత్తగా 286 కరోనా కేసులు.. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో