ఆటో డ్రైవర్‌కు రూ.18వేలు జరిమానా; ఆత్మహత్యాయత్నం

ఆటో డ్రైవర్‌కు రూ.18వేలు జరిమానా; ఆత్మహత్యాయత్నం

కొత్త మోటారు వాహనాల చట్టం వచ్చినప్పటి నుంచి వాహనదారులకు రోడ్ల మీదకు రావాలంటేనే భయపడుతున్నారు. రూల్ ఉల్లంఘించారంటే ఇక అంతే. పోలీసులు విధించే జరిమానాలకు గుండెల్లో దడ పుట్టిస్తున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా బాదేస్తుండటంతో ఫైన్‌లను కట్టలేక ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. 

గుజరాత్‌లోని రాజు సోలంకి అనే ఓ ఆటో రిక్షా డ్రైవర్ ట్రాఫిక్ వాళ్లు విధించిన జరిమానా కట్టలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అహ్మదాబాద్ వ్యక్తికి రూ.18వేలు ఫైన్ విధించారు. రోజువారీ సంపాదనే అంతగా లేదని ఆ ఫైన్ కట్టలేనని భయంతో సూసైడ్‌కు యత్నించాడు. ఫైన్ కట్టకపోతే వాహనం రోడ్డెక్కే పరిస్థితి లేదని తెలుసుకుని ఫినాయిల్ తాగాడు.

స్థానికులు స్పందించి హాస్పిటల్‌కు తరలించారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్న వ్యక్తి జరిమానా కట్టే పరిస్థితుల్లో లేడని స్థానికులు చెబుతున్నారు. ఫైన్ కట్టలేదనే కారణంతో అతని ఆటో రిక్షాను పోలీసులు సీజ్ చేశారు. అతను డిగ్రీ చదివినప్పటికీ ఉద్యోగం దొరకక ఆటోకు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.