Gujarat Sadhvi Loyal Dog : గుజరాత్ సాధ్వి అంతిమయాత్రలో 5కి.మీ నడిచిన కుక్క.. ఇలా విశ్వాసాన్ని చాటుకుంది!

యజమాని పట్ల కుక్కలు ఎంత విశ్వాసంతో, విధేయతగా ఉంటాయో చెప్పనక్కర్లేదు. మనుషుల కంటే కుక్కలకే విశ్వాసం ఎక్కువ అంటారు.. ఇప్పుడు అది నిజమేనని రుజువుచేసిందో కుక్క.. సూరత్‌లోని వెసు ప్రాంతంలో 100 ఏళ్ల జైన సన్యాసి (సాధ్వి) కన్నుమూశారు.

Gujarat Sadhvi Loyal Dog : గుజరాత్ సాధ్వి అంతిమయాత్రలో 5కి.మీ నడిచిన కుక్క.. ఇలా విశ్వాసాన్ని చాటుకుంది!

Gujarat Sadhvi's Loyal Dog Walks 5 Km

Gujarat Sadhvi Loyal Dog : యజమాని పట్ల కుక్కలు ఎంత విశ్వాసంతో, విధేయతగా ఉంటాయో చెప్పనక్కర్లేదు. మనుషుల కంటే కుక్కలకే విశ్వాసం ఎక్కువ అంటారు.. ఇప్పుడు అది నిజమేనని రుజువుచేసిందో కుక్క.. సూరత్‌లోని వెసు ప్రాంతంలో 100 ఏళ్ల జైన సన్యాసి (సాధ్వి) కన్నుమూశారు. సన్యాసి పార్ధీవదేహాన్ని పల్లకీలో మోస్తూ పాల్కి యాత్ర నిర్వహించారు. ఈ పాల్కీ యాత్రలో అందరితో పాటు 5 కిలోమీటర్ల దూరం నడిచింది ఈ కుక్క.. యజమాని ఇంటి నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉమారా శ్మశానవాటిక వరకు పల్లకీ కింద నడిచింది కుక్క. శ్మశానవాటికకు వచ్చిన సన్యాసిని శిష్యులు కుక్కను కారులో ఎక్కించుకుని తర్వాత వెసూ ప్రాంతంలో వదిలివేశారు.

వెసు ప్రాంతంలోని రామేశ్వరం అపార్ట్ మెంట్లో ఒకప్పుడు పియూష్ వర్షా సాధ్వి మహారాజ్ నివసించారు. అదే చోట ఈ కుక్క ఉండేది. కొన్ని సంవత్సరాల క్రితమే సాధ్వి ఈ ప్రాంతానికి మారిపోయారు. అప్పటినుంచి తరచూ కుక్కకు ఆహారం ఇస్తున్నారు. తన ఆకలి తీర్చిన సన్యాని పట్ల ఎంతో విధేయతగా ఉండేది..

సాధ్వి కన్నుమూయడంతో స్థానికులు, ఆమె శిష్యులు కొందరితో కలిసి అంతమ సంస్కారాల కోసం ఏర్పాట్లు చేశారు. సాధ్వి పాల్కీ యాత్ర ప్రారంభం కాగానే ఆమె కుక్క కూడా పాల్కీ కింద నడవడం ప్రారంభించింది. అదిచూసిన వారంతా కుక్కను దూరంగా తరిమికొట్టేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ యజమానిని వదల్లేదు. మళ్లీ వచ్చి పల్లకీ కింద నడవడం మొదలుపెట్టింది. అలా పాల్కీ యాత్ర కొనసాగినంత సమయం అలానే నడిచింది. చివరికి యాత్ర ఉమ్రా శ్మశానవాటికకు చేరుకునే వరకు కుక్క నడస్తూ వచ్చింది. సాధ్వి అంతిమ సంస్కారాలు ముగిసినా కూడా కుక్క అక్కడే నిలబడి పోయింది. కొందరు సాధ్వి శిష్యులు ఆ కుక్కను తమ కారులో ఎక్కించుకుని తిరిగి వెసూ ప్రాంతంలో వదిలేశారు. తనకు ఆహారం పెట్టిన సాధ్వి పట్ల కుక్క ఎంతో విదేయతతో మెలిగింది..