Tokyo Olympics : మహిళల హాకీ జట్టుకు గుజరాత్ వ్యాపారి సూపర్ ఆఫర్‌

టోక్యో ఒలింపిక్స్ లో సత్తా చాటి పతకాలను సాధించినవారికి భారత్ ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, కొంతమంది వ్యాపారులు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత మహిళల హాకీ జట్టుకు గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి సావ్‌జీ ధోలాకియా బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు.

Tokyo Olympics : మహిళల హాకీ జట్టుకు గుజరాత్ వ్యాపారి సూపర్ ఆఫర్‌

Surath Merchant Promises Houses Cars For Women's Hokey Team..

Surath merchant promises houses cars for Women’s Hokey team.. : టోక్యో ఒలింపిక్స్ లో సత్తా చాటి పతకాలను సాధించినవారికి భారత్ ప్రభుత్వంతో పాటు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, కొంతమంది వ్యాపారులు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత మహిళల హాకీ జట్టుకు గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి సావ్‌జీ ధోలాకియా బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు.

ఒలింపిక్స్‌ పతకం గెలుచుకొని వస్తే సొంలత ఇల్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. మహిళల హాకీ జట్టు సభ్యులందికి రూ.11లక్షలు ఇస్తానని హెచ్‌కే గ్రూప్‌ అధినేత ప్రకటించారు. ఇళ్లున్నవారికి కారు గిఫ్టుగా ఇస్తానని తెలిపారు. టోక్యో-2020 ఒలింపిక్స్‌లో మహిళల జట్టు మంగళవారం (ఆగస్టు 3,2021) జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఒడించి సెమీఫైనల్‌కు చేరిన సందర్భంగా ధోలాకియా ట్విట్టర్‌ ద్వారా ఈ ప్రకటన చేశారు. మహిళల హాకీ టీమ్‌ సాధించిన అద్భుతమైన విజయం గర్వంగా ఉందని..భారత్ యావత్తు మహిళల హాకీ టీమ్ ను చూసి గర్విస్తోందని అన్నారు. ఈ సందర్భంగా జట్టు సభ్యులను సత్కరించి వారికి బహుమతులు అందిస్తామని తెలిపారు.

టోక్యో ఒలింపిక్స్ లో సెమీఫైనల్ కు చేరిన భారత మహిళల హాకీ జట్టు..
టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు అద్భుత ఆట తీరును కనబరిచింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో భారత మహిళల జట్టు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి భారత్ తల ఎత్తుకునేలా చేసింది. క్వార్టర్‌ ఫైనల్‌లో ఆస్ట్రేలియాలాంటి జట్టును మట్టికరిపించి.. సెమీ ఫైనల్‌కు చేరింది. దాదాపు 20 ఏళ్లు వెంటాడిన ఓటమి మహిళా టీమ్ సమిష్టి కృషి,పడిన కష్టం, పట్టుదల ముందు తలదించింది. విజయం సొంతమయ్యింది. ఈ విజయం కోసం మహిళా టీమ్ ఎంతో ఆనందం వ్యక్తంచేసింది. దీని కోసం ఈ అరుదైన విజయం కోసం టీమ్ మొత్త ఎన్ని ఆటంకాలను దాటి ఈ స్థాయికి చేరుకున్నారో వారికే తెలుసు..ఒక్కొక్కరిదీ ఒక్కో కథ. వాటన్నింటిని ఈ విజయం మరిపించింది. ఆనందించేలా చేసింది.

ఆ విజయాన్ని ఆస్వాదిస్తు మహిళలంతా ముక్తకంఠంతో వెర్రిగా కేకలు వేశారు. వారి ఆనందాన్ని వ్యక్తపరిచారు. గెలుపు కోసం సమిష్టిగా ఎలా కృషి చేశారో.. విజయం సాధించిన అనంతరం అందరూ కలిసి ఐక్యంగా సంతోషాన్ని షేర్ చేసుకున్నారు. మిగతా ఆటల్లో ఎలా ఆడాలో ప్లాన్ వేసుకున్నారు. ఒకరినొకరు కౌగిలించుకుని అభినందించుకున్నారు. టీమ్ పెట్టిన కేకలతో స్టేడియం అంతా మార్మోగిపోయింది. ఆ విజయానందపు కేకలు ప్రపంచం నలుమూలలా ప్రతిధ్వనించాయా అన్నట్లుగా ఉంది. కోచ్‌లు కూడా తమ వయసును మర్చిపోయి.. సంతోషంతో గెంతులేశారు. ఆ క్షణానా వారి ముఖాల్లో కనిపించిన సంతోషాన్ని ఎన్ని కోట్లిచ్చినా విలువ కట్టలేం. ఇక సెమీస్‌లో భారత మహిళా జట్టు అర్జెంటీనాతో తలపడనుంది.