తల్లి మరణం..బైటకురాకుండా 10 ఏళ్లుగా ఒకే గదిలో ముగ్గురు తోబుట్టువులు..తండ్రే బంధించాడా..

తల్లి మరణం..బైటకురాకుండా 10 ఏళ్లుగా ఒకే గదిలో ముగ్గురు తోబుట్టువులు..తండ్రే బంధించాడా..

Gujarat: Three siblings locked up in room ..rescued after 10 years : తల్లి మరణంతో ముగ్గురు పిల్లలు గత 10 ఏళ్లుగా ఒకే గదికి పరిమితమైపోయారు. ఒక్కసారి కూడా బైటకు రాలేదు.  ఆ ముగ్గురు తోబుట్టువులు చిన్నవాళ్లు కాదు..30 నుంచి 42 ఏళ్ల వారు. తల్లి చనిపోయిననాటినుంచి ఆ ముగ్గురు తోబుట్టువులు గదినుంచి బైటకే రాలేదు.


      

అలాని వాళ్లు చదువు లేనివాళ్లు కాదు ముగ్గురు ఉన్నత చదువులు చదివినవారే కావటం విశేషం..గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఆ ముగ్గురి గురించి తెలిసిన ఓ స్వచ్ఛంధ సంస్థ వారిని బైటకు తీసుకొచ్చే యత్నం చేయటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ ముగ్గురు చిక్కి శల్యమైపోయి ఎముకల గూడులా ఉన్నారని సదరు సంస్థ తెలిపింది.


రాజ్ కోట్ లో సంపన్నులు నివసించే కిషన్ పారా ప్రాంతంలోని అమ్రీష్ మెహతా (42), మేఘనా మెహతా (39), భవేశ్ మెహతా (30) అనే ముగ్గురు తోబుట్టువులు తమ తల్లి చనిపోయినప్పటి నుంచి వారు ఆ గది నుంచి బయటికి రాలేదు. తండ్రి నవీన్ భాయ్ మెహతా వాళ్లకు తిండి..నీళ్లు అందిస్తుంటారు.



ఈ విషయం తెలుసుకున్న ఓ ఎన్జీవో సంస్థ వారి ఇంటికి వెళ్లింది. గది తలుపులు తెరిచి చూడగా చిక్కి శల్యమైన స్థితిలో ఆ ముగ్గురు తోబుట్టువులు కనిపించారు. వారిని అలా చూడగానే వారికి ఎంతో బాధకలిగింది. ఆ గదిలోనే మలమూత్రాలు విసర్జన వాసనలు ఎన్జీవో సిబ్బందిని ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. ఆహారం అంతా పాచి పట్టేసిన వాసన కూడా రావటంతో వారికి వాంతులు అయినంత పని అయ్యింది. కడుపులో వికారంలాగా అయిపోయింది.


జుట్టు బాగా పెరిగిపోయి జడలు కట్టేసి చిక్కి శల్యమైపోయినవాళ్లను చూస్తే కాస్త భయం కలిగేలా ఉన్నారు. వారి ముగ్గురిలో ఇద్దరు పురుషులు కావటంతోవారికి భారీగా గడ్డాలు, మీసాలు పెరిగిపోయి అత్యంత నీరసరంగా ఉన్నారు. మూడో తోబట్టువు సోదరి అత్యంత బలహీన స్ధితిలో ఆమె నేలపై నీరసంగా పడుకుని ఉంది. తన ఇంటికి ఎన్జీవో సభ్యులు వచ్చారని తెలుసుకున్న వారి తండ్రి నవీన్ భాయ్ మెహతా అక్కడికి వచ్చి..వారి తల్లి చనిపోయిన తర్వాత తన బిడ్డలు ఇలా తయారయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.



పిల్లల కోసం తానే ఆహారం వండి పెడుతుంటానని కానీ వాళ్లకు ఇష్టమైతేనే తింటారని చెప్పాడు. కానీ ఇరుగుపొరుగు వారు మాత్రం నవీన్ భాయ్ మెహతాకు మూఢనమ్మకాలు బాగా ఎక్కువనీ..తన పిల్లలకు ఎవరో చేతబడి చేయించారని వారిని రక్షించుకోవడానికి ఇలా గదిలో దాచిపెట్టి ఉండాడని చెబుతున్నారు.

ఆ ముగ్గురిలో పెద్దవాడైన అమ్రీష్ బీఎ ఎల్ఎల్ బీ చదివి లాయర్ గా కూడా పనిచేశాడు. కూతురు మేఘన ఎంఏ సైకాలజీ చేయగా..చిన్నవాడైన భవేశ్ ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడమే కాదు, మంచి భవిష్యత్తు ఉన్న క్రికెటర్ గా అప్పట్లో గుర్తింపు పొందాడట. ఇంతటి విద్యాద్ధికులైన వీరు ఇంత దారుణస్థితికి చేరుకోవటం సర్వత్రా సానుభూతి వ్యక్తమవుతోంది.



సదరు ఎన్జీవో సభ్యుల సహకారంతో వారికి శుభ్రంగా గుండ్లు చేయించి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.వారు కోలుకున్నాక..ఓ సంరక్షణ కేంద్రానికి తరలించాలని ఎన్జీవో సిబ్బంది భావిస్తున్నారు.

ఈ ఘటనపై ఎన్జీవో సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా..కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తండ్రే కావాలని వారిని బంధించాడా? లేదా తల్లి మరణంతో వాళ్లు డిప్రెషన్ లోకి వెళ్లి అలా అయిపోయారా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.