Gujarat: మైనర్ బాలిక నిజం నిరూపించుకోవాలంటే మరిగే నూనెలో చేతులు పెట్టాలట

ఓ మైనర్ బాలిక తాను చెప్పేది నిజమేనని నిరూపించుకోవడానికి మరిగే నూనెలో చేతులు పెట్టాలని ఓ మహిళ ఆదేశించింది. అంతేకాదు ఆ 40ఏళ్ల మహిళ..

Gujarat: మైనర్ బాలిక నిజం నిరూపించుకోవాలంటే మరిగే నూనెలో చేతులు పెట్టాలట

Minor Girl

Gujarat: ఓ మైనర్ బాలిక తాను చెప్పేది నిజమేనని నిరూపించుకోవడానికి మరిగే నూనెలో చేతులు పెట్టాలని ఓ మహిళ ఆదేశించింది. అంతేకాదు ఆ 40ఏళ్ల మహిళ.. 11ఏళ్ల బాలిక చేతులను నూనెలో ముంచేసింది కూడా. నిందితురాలిని లాఖీ మక్వానాగా గుర్తించారు. బుధవారం గుజరాత్ లోని సంతల్‌పూర్ టౌన్ లో ఆమెను అరెస్ట్ చేశారు.

కుడి చేతికి కాలిన గాయాలున్న వీడియోను స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. సంతల్పూర్ పోలీస్ స్టేషన్ సబ్‌ఇన్‌స్పెక్టర్ ఎన్డీ పర్మార్ ఘటనపై కేసు నమోదు చేసి బాధితురాలిని కుటుంబంతో సహా అరెస్టు చేశారు. మైనర్ బాలిక పదిరోజుల క్రితం ఎవరో గుర్తు తెలియని వ్యక్తితో మాట్లాడుతుందని నిందితురాలు ఆరోపిస్తుందని పేర్కొన్నారు.

బుధవారం ఉదయం బాలిక పేరెంట్స్ ఇంట్లో లేని సమయంలో ఒక వ్యక్తితో బాలిక మాట్లాడిందని ఆ విషయం ఇంట్లో చెప్పేస్తానంటూ బెదిరించింది. బాలిక తాను మాట్లాడలేదని చెప్పినప్పటికీ నమ్మకుండా నిజం నిరూపించుకోవాలని మరిగే నూనెలో చేయి పెట్టమని చెప్పింది. ఆ మాటకే భయపడిన బాలిక పరిగెత్తేందుకు ప్రయత్నించగా బలవంతంగా కుడిచేతిని నూనెలో పెట్టేయడంతో గాయాలయ్యాయని పోలీసులు అంటున్నారు.

ఇంటి పక్కన ఉండే మరో వ్యక్తికి విషయం తెలియడంతో హాస్పిటల్ కు తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించారు. డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చాక నిందితులపై బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేర వారిని అరెస్టు చేశారు.

 

…………………………………. : ఏపీలో ఎంపీపీ ఎలక్షన్స్..చేతులు ఎత్తి ఎన్నుకునే విధానం

‘పటాన్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందించాం. జిల్లా ఛైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కు బాధితురాలి ఇంటికి వచ్చి పరిశీలించాల్సిందిగా చెప్పాం. ఘటనపై ఇన్వెస్టేషన్ చేసి రిపోర్టు సబ్‌మిట్ చేయాలని’ గుజరాత్ స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ చైర్ పర్సన్ జాగృతిబెన్ పాండ్యా వెల్లడించారు.