Gujarat : ప్రిన్సిపాల్‌తో విద్యార్థిని కాళ్లకు దణ్ణం పెట్టించిన ఏబీవీపీ

గుజరాత్ లోని ఓ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలో మహిళా ప్రిన్సిపాల్ కు అవమానం జరిగింది. ప్రిన్సిపాల్ తో విద్యార్ధిని కాళ్లు పట్టించారు ఆర్‌ఎస్‌ఎస్‌ విద్యార్థి సంఘం నాయకులు.

Gujarat :  ప్రిన్సిపాల్‌తో విద్యార్థిని కాళ్లకు దణ్ణం పెట్టించిన ఏబీవీపీ

Woman Principal Forced To Touch Feet Of Student In Gujarat College

Gujarat :  గుజరాత్ లోని ఓ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలో మహిళా ప్రిన్సిపాల్ కు అవమానం జరిగింది. సాధారణంగా పెద్దలు పిల్లల కాళ్లకు దణ్ణం పెట్టకూడదంటారు. అటువంటిదో ప్రిన్సిపాల్ తో విద్యార్ధిని కాళ్లు పట్టించారు ఆర్‌ఎస్‌ఎస్‌ విద్యార్థి సంఘం నాయకులు.దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ కావడంతో ఆర్‌ఎస్‌ఎస్‌ విద్యార్థి సంఘం తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ సంఘటన గురువారం (మే 12,2022) జరిగింది. ఓ చిన్న కారణాన్ని రాద్ధాంతం చేసి విద్యార్థిని కాళ్లకు దణ్ణం పెట్టించారు ఏబీవీపీ విద్యార్ధి సంఘం నాయకులు.

ఓ ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీలో రెండో సెమిస్టర్‌ చదువుతున్న విద్యార్థిని హాజరు తక్కువగా ఉంది. దీంతో గురువారం ఏబీవీపీ నేత అక్షత్ జైస్వాల్ సదరు విద్యార్థినితోపాటు మరి కొంతమందిని తీసుకుని మహిళా ప్రిన్సిపాల్‌ మోనికా స్వామి చాంబర్‌కు వెళ్లాడు. విద్యార్థిని హాజరు తక్కువగా ఉందేంటీ అంటూ ప్రిన్సిపాల్ తో పాటు కాలేజీ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. ఆ విద్యార్థిని కాళ్లు మొక్కి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశాడు. దానికి ప్రిన్సిపాల్ సిబ్బంది ఎంతగా చెప్పినా వినలేదు. పైగా ఆమె కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశాడు. దీంతో చేసేదేమీ లేక ఆ గొడవను అంతటితో ఆపేయటానికి మహిళా ప్రిన్సిపాల్‌ మోనికా, ఆ విద్యార్థినికి రెండు చేతులతో మొక్కింది. తరువాత తన కూర్చి నుంచి లేచి ఆమె కాళ్లకు దణ్ణం పెట్టిందామె. ఆమే కాకుండా సిబ్బందిలో మరో మహిళ కూడా విద్యార్ధిన పాదాలకు దణ్ణం పట్టింది.

దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావటంతో ఏబీవీపీ తీరుపై కాంగ్రెస్‌ విద్యార్థి సంఘం ఎన్‌ఎస్‌యూఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్‌ఎస్‌ఎస్‌ విద్యార్థి సంఘం చర్య సిగ్గు చేటని ఎన్‌ఎస్‌యూఐ జాతీయ కన్వీనర్ భావవిక్ సోలంకి విమర్శించారు.విద్యా సంస్థల్లో ఏబీవీపీ గూండాయిజానికి ఈ వీడియో నిదర్శనమని ఆగ్రహం వ్యక్తంచేసింది.

మరోవైపు ఈ ఘటనపై అక్షత్ జైస్వాల్ శుక్రవారం క్షమాపణలు చెప్పారు. ఉపాధ్యాయ, విద్యార్థి మధ్య సంబంధాన్ని పవిత్రంగా తమ సంస్థ భావిస్తుందని..తెలిపారు.ఈ విషయంలో తప్పు చేసిన అక్షత్ జైస్వాల్‌ను ఏబీవీపీ నుంచి తొలగించినట్లుగా ABVP ప్రధాన కార్యదర్శి ప్రార్థన అమీన్ వెల్లడించారు. అలాగే ఏబీవీపీ సీనియర్‌ నేతలు ఆ మహిళా ప్రిన్సిపాల్‌ను స్వయంగా కలిసి జరిగిన దానికి క్షమాపణలు చెప్పారు.