free lemons : కరోనా పేషెంట్లకు ఫ్రీగా నిమ్మకాయలు పంచుతున్న యువ రైతు

free lemons : కరోనా పేషెంట్లకు ఫ్రీగా నిమ్మకాయలు పంచుతున్న యువ రైతు

Farmer Giving Free Lemons To Corona Patients (1)

Inspiration farmer : గుజరాత్‌లోని మోర్బీలో విజయ్ భాయ్ సీతాపారా అనే యువ రైతు కరోనా రోగుల కోసం చేస్తున్న పనికి అందరూ ప్రశంసిస్తున్నారు. హద్మతీయ గ్రామంలో… విజయ్ భాయ్ సీతాపారాకు ఓ చిన్న నిమ్మతోట ఉంది. ఈ తోటలో 40 వరకూ నిమ్మ చెట్లున్నాయి. ఆ చెట్లనుంచి ప్రతీరోజు 8 నుంచి 10 కేజీల నిమ్మకాయల్ని దిగుమతి చేస్తున్నాడు విజయ్. కానీ వాటిని అతను అమ్ముకోవటంలేదు. కరోనా పేషెంట్లకు ఉచితంగా ఇస్తున్నాడు. కరోనా బాధితులు త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని కోరుతున్నాడు. ఈ కరోనా కాలంలో ఇమ్యూనిటీ పెంచుకోవటానికి ‘మిటమిన్ సి’ చాలా అవసరం. కరోనా బాధితులకు ‘సి’విటమిన్ చాలా అవసరం. దీంతో కరోనా కాలం..పైగా వేసవి కాలం కావటంతో మార్కెట్ లో నిమ్మకాయల ధరలు మండిపోతున్నాయి. ఒక్కో నిమ్మకాయం రూ.5 లు అమ్ముతోంది. దీంతో నిమ్మకాయలు కొనాలంటే జేబులు ఖాళీ అవుతున్నాయి. కానీ నిమ్మరైతులకు వేసవికాలంలోనే నాలుగు రూపాయలు గిడతాయి.

కానీ విజయ్ భాయ్ సీతాపారా మాత్రం లాభాల కోసం చూసుకోవట్లేదు. ప్రస్తుతమున్న పరిస్థితుల్ని క్యాష్ చేసుకోవాలనుకోలేదు. నిమ్మకాలయకు డిమాండ్ ఉన్న ఈ వేసవిలో కూడా ‘సొంత లాభం కొంత మానుకుని’ కరోనా పేషెంట్లకు తన తోటలో పండిన నిమ్మకాయల్ని ఇస్తున్నాడు. మీరు త్వరగా కోలుకోవాలన్నా..ఆరోగ్యంగా ఉండాలి’ అని చెబుతున్నాడు. అసలే మన దేశంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంటోంది. అలాంటిది… ఈ యువ రైతు చేస్తున్న పని అందునా ఈ ప్రస్తుత కాలంలో చేసే ఈ దానగుణం ఎంత గొప్పది. మాటలకు అందని పెద్ద మనస్సు విజయ్ ది అంటున్నారు.

ప్రస్తుతం మన మార్కెట్లలో ఒక్క నిమ్మకాయ రూ.5 ఉంటోంది. కరోనా కారణంగా చాలా మంది సీ విటమిన్ కోసం నిమ్మకాయలు కొంటున్నారు. కొనాల్సి వస్తోందికూడా. దీంతో నిమ్మకాయలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. రూ.10లకు పది ఇచ్చే నిమ్మకాయలు ఇప్పుడు ఒక్కోటి రూ.5లు అమ్ముతోంది. దీంతో చాలామంది కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నారు.

దీంతో కరోనాతో బాధితుల ఇబ్బంలు చూసిన విజయ్ భాయ్‌కి ఓ కొత్త ఆలోచన వచ్చింది. అదే తన తోటలో పండే నిమ్మకాయల్ని కరోనా బాధితులకు ఫ్రీ గా ఇవ్వాలని. నిమ్మకాయలు కావాల్సిన వారు తన తోటకు వచ్చి ఫ్రీగా పట్టుకెళ్లమని చెప్పాడు. దీంతో ప్రతీ రోజూ 25 నుంచి 30 కుటుంబాల వాళ్లు వచ్చి.. నిమ్మకాయలు ఫ్రీగా తీసుకెళ్తున్నారు. అలాతన దగ్గరకు వచ్చినవాళ్లకు ‘జాగ్రత్త’ అన్నా..మీరు త్వరగా ఆరోగ్యవంతులవ్వాలి’ అని చెబుతున్నాడు. విజయ్ భాయ్‌ని ఇన్సిరేషన్ గా తీసుకున్న విజయ్ కు మరో ఆలోచన వచ్చింది. తన తోటకు వచ్చి పట్టుకెళ్లేకంటే..నిమ్మకాయల్ని తానే స్వయంగా పట్టుకెళ్లి ఇవ్వొచ్చుకదాని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఆస్పత్రులకు వెళ్లి కరోనా పేషెంట్లకు ఇస్తున్నాడు. ఇప్పుడు మోర్బీలో ఎక్కడ విన్నా విజయ్ భాయ్ మాటే. ఫ్రీగా నిమ్మకాయలు ఇస్తున్నాడ..నిజంగా గ్రేట్ అతను అని..