#GujaratElections: అందుకే ప్రజలు బీజేపీకి ఓటు వేస్తున్నారు: కేంద్ర మంత్రి అమిత్ షా

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలోని ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపారని అమిత్ షా చెప్పారు. గతంలో గుజరాత్ ప్రజలు నీటి సమస్య ఎదుర్కొన్నారని, దానికి మోదీ శాశ్వత పరిష్కారం చూపారని తెలిపారు. అలాగే, ప్రతి గ్రామానికి 24 గంటల విద్యుత్తు, ఆరోగ్య సదుపాయాలు కల్పించారని చెప్పారు. అందుకే ప్రజలు బీజేపీకి ఓటు వేస్తున్నారని, తమ పార్టీపై అభిమానాన్ని చూపుతున్నారని అన్నారు.

#GujaratElections: అందుకే ప్రజలు బీజేపీకి ఓటు వేస్తున్నారు: కేంద్ర మంత్రి అమిత్ షా

AAP May Not Open Account, Opposition Nowhere Close To PM Modi, Says Amit Shah

#GujaratElections: ప్రజలు బీజేపీకి ఎందుకు ఓటు వేస్తున్నారన్న విషయంపై కేంద్ర మంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఇవాళ ఆయన ఆ రాష్ట్రంలో మాట్లాడుతూ… ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలోని ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపారని చెప్పారు. గతంలో గుజరాత్ ప్రజలు నీటి సమస్య ఎదుర్కొన్నారని, దానికి మోదీ శాశ్వత పరిష్కారం చూపారని తెలిపారు. అలాగే, ప్రతి గ్రామానికి 24 గంటల విద్యుత్తు, ఆరోగ్య సదుపాయాలు కల్పించారని చెప్పారు. అందుకే ప్రజలు బీజేపీకి ఓటు వేస్తున్నారని, తమ పార్టీపై అభిమానాన్ని చూపుతున్నారని అన్నారు.

కాగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రావణుడిగా పేర్కొనడంపై అమిత్ షా స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. ‘‘ప్రధాని మోదీపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఎప్పుడెప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేశారో ఆయా సమయాల్లో గుజరాత్ ప్రజలు ఆ పార్టీకి బ్యాలెట్ బ్యాక్స్ తో బుద్ధి చెబుతున్నారు. ఈ సారి కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన సమాధానం చెబుతారు’’ అని అమిత్ షా అన్నారు.

ఇటీవల అహ్మదాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమంలో మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ మోదీపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అన్ని ప్రచార కార్యక్రమాల్లో మోదీ తన గురించే మాట్లాడుకుంటారని అన్నారు. తనను మాత్రమే చూసి ఓటు వేయాలని అంటారని చెప్పారు. ఇంకా ఎన్నిసార్లు ఆయన ముఖం చూడాలని ప్రశ్నించారు. ఆయనకు ఎన్ని రూపాలు ఉన్నాయని అన్నారు. రావణుడిలా అనేక తలలు ఉన్నాయా? అని నిలదీశారు. దీంతో మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..