Gujarat Drug Mafia : యాచ‌కులు, అనాధ‌లపై డ్ర‌గ్స్ ప్రయోగాలు..

డ్రగ్ మాఫియా అనాథలను, యాచకులను టార్గెట్ గా చేసుకుని అరాచకాలకు పాల్పడుతోంది. డ్రగ్స్ ప్రభావం తెలుసుకోవటానికి యాచకులకు,అనాథలపై డ్రగ్స్ ప్రయోగాలకు పాల్పడుతున్న ఘటన గుజరాత్ లోబయటపడింది

Gujarat Drug Mafia : యాచ‌కులు, అనాధ‌లపై డ్ర‌గ్స్ ప్రయోగాలు..

Gujarat Drug Mafia

Gujarat drug mafia targets beggars : కాసుల కోసం డ్రగ్స్ మాఫికా అరాచకాలు పెచ్చరిల్లిపోతున్నాయి. సాటి మనుషుల శరీరాలను గిన్నీ పిగ్స్ గా మార్చేస్తున్నారు.దిక్కులేని అనాథలను..రోడ్లపై భిక్షమెత్తుకునేవారి శరీరాలను ప్రయోగశాలలుగా మార్చేస్తున్న అత్యంత దారుణమైన ఘోరాలకు పాలపడుతున్నారు. గుజ‌రాత్‌లో డ్ర‌గ్ మాఫియా చెల‌రేగిపోతున్న క్రమంలో అనాధలను, భిక్షగాళ్లేన టార్గెట్ వారి శరీరాలపై డ్రగ్స్ ప్రయోగాలు చేస్తున్నారు. డ్రగ్స్ ప్రభావం ఎంతగా ఉంటుందో అంచనా వేయటానికి గుజరాత్ లో డ్రగ్స్ మాఫియా చేస్తున్న అరాచకాలకు అంతు లేకుండాపోతోంది. ఈ క్రమంలో అనాథలు, భిక్షాటన చేసేవారినిపై డ్రగ్స్ ప్రయోగాలు చేస్తున్నారు.

డ్ర‌గ్ మాఫియా అరాచ‌కం సింథ‌టిక్ డ్ర‌గ్స్ ప‌నితీరును తెలుసుకునేందుకు బిచ్చ‌గాళ్ల శరీరాల‌పై డ్రగ్స్ ప్రయోగించి అవి విజ‌య‌వంత‌మైతే..వాటిని బ్లాక్ మార్కెట్‌లో అమ్మటానికి పెడుతోంది. దీని కోసం గుజరాత్ డ్రగ్స్ మాఫియా అహ్మ‌దాబాద్‌లోని వీధులు, బ‌స్టాండ్‌లు, రైల్వేస్టేష‌న్ల‌లో అనాధ‌లుగా ఉన్నవారిని..భిక్షాటన చేసి జీవిస్తున్నవారిని టార్గెట్ గా చేసుకుని వారిపై డ్ర‌గ్స్ ప‌నితీరును ప‌రీక్షిస్తోంది.

డ్ర‌గ్ మాఫియా అరాచ‌కంతో యాచ‌కుల ప్రాణాల‌ు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. క‌లుపూర్ రైల్వే స్టేష‌న్‌లో భిక్షాటన చేసిన జీవించే స‌లీం మ‌హ్మ‌ద్ అనే యాచ‌కుడు డ్ర‌గ్స్‌కు బానిసగా మారాడు. గంజాయి సేవిస్తున్న అతడిని తమ ప్రయోగాలకు వాడుకుందామని డిసైడ్ అయ్యింది.అతడి పరిస్థితిని ఆసరాగా చేసుకున్న డ్రగ్స్ మాఫియా అతనికి ఓ మాద‌క ద్ర‌వ్యాన్ని ఇచ్చింది పరీక్షల కోసం. మత్తు ప్రభావం ఎంతగా ఉంటుందోనని అతనికి మాదకద్రవ్యాన్ని ఇచ్చి అతడిని నిరంతరం పర్యవేక్షించింది. ఆ డ్ర‌గ్ సేవించిన కొద్దిసేప‌టికే స‌లీం వాంతులు చేసుకోవటం మొదలు పెట్టాడు. తరువాత వాంతులతో పాటు ముక్కు నుంచి రక్తం కారింది. దీంతో అక్కడి నుంచి వాళ్లు వెళ్లిపోయారు. అలాగే మ‌హేష్ ద‌తానీ అనే అనాథకు పొడి రూపంలో ఉండే డ్ర‌గ్‌ ఇచ్చారు. అలా అతడిని కూడా పరీక్షించగా..అది తీసుకున్న కొద్దిసేపటికే సైకోలా ప్ర‌వ‌ర్తించ‌డం మొదలు పెట్టాడు. దీంతో స్థానికంగా క‌ల‌క‌లం రేగింది.

ఎప్పుడు పెద్దగా మాట్లాడని మహేష్ దతానీ ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కాలేదు.పింది. ద‌తానీ అలా ప్రవర్తిస్తూ కాళ్లు, చేతుల‌ను గోడ‌కు బ‌లంగా కొట్టుకోవ‌డంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఇలా పలు ప్రాంతాల్లో పలువురు వివిధ రకాలుగా వ్యవహరించటం, అస్వస్థతకు గురికావటం పోలీసులు దర్యాప్తు చేయగా ఈ విషయాలు బయటపడ్డాయి. దీంతో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగగా అసలు విషయం బయటపడింది. భిక్షాటన చేసేవారు అనాధలను డ్రగ్స్ మాఫియా టార్గెట్ గా చేసుకుని ఇటువంటి ప్రయోగాలు చేస్తోందని గుర్తించారు.

అహ్మ‌దాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు డ్ర‌గ్ మాఫియా ఆగ‌డాలు త‌మ దృష్టి పెట్టారు. కానీ బాధితులు యాచకులు, అనాథలు కావటంతో త‌మ‌కు ఎలాంటి ఫిర్యాదులు అంద‌లేద‌ని తెలిపారు. కానీ ఈ అంశంపై దృష్టిపెట్టామని డ్రగ్స్ మాఫియాను పట్టుకుంటామని తెలిపారు.