పార్కులో ప్రధాని : చిలకమ్మలతో మోడీ ముచ్చట్లు

  • Published By: nagamani ,Published On : October 31, 2020 / 11:51 AM IST
పార్కులో ప్రధాని :  చిలకమ్మలతో మోడీ ముచ్చట్లు

Gujarath : pm modi parrots : ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిట్టి చిలుకలపై ముచ్చట్లాడారు. గుజరాత్ లోని జంగిల్ సఫారీని శుక్రవారం (అక్టోబర్ 30,2020) ప్రారంభించిన మోడీ చిలుకలతో ఆహ్లాదంగా గడిపారు. వాటిపై ప్రేమ కురిపించారు. చిట్టిపొట్టి చిలకమ్మలతో ముచ్చట్లాడిన ప్రధాని చేతిపైనా..భుజంపై ఒక చిలుక వాలాయి…


చిట్టి చిలుకమ్మలను చూసి మోడీ చిరునవ్వులు చిందిస్తూ మురిసిపోయారు.ఆయన దీనికి సంబంధించిన వీడియోలు..ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జంగిల్ సఫారీని ప్రారంభించిన అనంతరం పులులు, జీబ్రాలు, జింకలు వంటి ఇతర జంతువులను చాలా ఆసక్తిగా తిలకించారు. వాటి బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు.


ఆరోగ్యవన్‌, ఏక్తామాల్‌, చిన్నపిల్లల పౌష్టికాహార పార్క్‌, సర్దార్‌పటేల్‌ జూలాజికల్‌పార్కు‌,జంగిల్‌ సఫారీలను ప్రధాని మోదీ శుక్రవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. జంగిల్‌ సఫారీ ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ భుజంపై ఒకటి, చేతిపై మరో చిలుకలు వాలాయి. ప్రకృతి ప్రియులైన మోదీ జంగిల్ సఫారీలో ప్రకృతితో పాటు జంతువులు, రంగురంగుల వివిధ రకాల చిలుకలు, పక్షులను చూసి మైమరచిపోయారు.


తన చేతులపై వాలిన రెండు చిలుకలను ప్రధాని మోదీ ప్రేమగా చూస్తుండి పోయారు.గతంలోనూ ఢిల్లీ లోక్ కళ్యాణ్ మార్గ్ లోని ప్రధాని మోదీ తన నివాసంలో జాతీయపక్షి నెమలికి గింజలు తినిపించే ఫొటోలు గతంలో వైరల్ అయ్యాయి.


సఫారీలో రంగురంగుల పక్షిని చేతిలోకి తీసుకొని దానికి ప్రేమగా గింజలను తినిపించారు.మోదీ ప్రారంభించిన సఫారీ పార్కు పులుల గర్జనలు, పక్షుల కిలకిలరావాలతో ఆహ్లాదకరంగా మారింది. 100 కు పైగా అడవి జంతువులు 1100 జాతుల విదేశీ పక్షులు ఈ పార్కులో ఉన్నాయి.