Naresh Patel : కాంగ్రెస్‌లో చేరనున్న పటీదార్ నేత నరేశ్ పటేల్..!

Naresh Patel : గుజరాత్‌లోని పటీదార్ నేత నరేష్ పటేల్ (Naresh Patel) కాంగ్రెస్‌ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తోంది. శనివారం (ఏప్రిల్ 23) కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆయన కలవనున్నారు.

Naresh Patel : కాంగ్రెస్‌లో చేరనున్న పటీదార్ నేత నరేశ్ పటేల్..!

Gujarat's Patidar Leader Naresh Patel Likely To Join Congress

Naresh Patel : గుజరాత్‌లోని పటీదార్ నేత నరేష్ పటేల్ (Naresh Patel) కాంగ్రెస్‌ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తోంది. శనివారం (ఏప్రిల్ 23) కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆయన కలవనున్నారు. ఈ నేపథ్యంలో నరేశ్ పటేల్ కాంగ్రెస్ లో చేరుతున్నారనే ప్రచారం జరుగుతోంది. గతకొన్ని నెలలుగా బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ నరేష్ పటేల్‌ను తమవైపు తిప్పుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అన్ని పార్టీలతో తాను సఖ్యతగానే ఉన్నప్పటికీ పటేల్ మాత్రం ఏ పార్టీలోనూ చేరలేదు. తమ పటేల్ సామాజిక వర్గ ప్రజల ఏం చెబుతారో అదే నిర్ణయం తీసుకుంటానని నరేష్ స్పష్టం చేశారు.

నరేష్ పటేల్.. ఖోడల్ధామ్ ట్రస్ట్ (SKT) అధ్యక్షుడిగా ఉన్నారు. లేయువా పటేల్ కమ్యూనిటీ ప్రత్యేకించి గౌరవించే మా ఖోడియార్ (Maa Khodiyar) ఆలయాన్ని నిర్వహిస్తోంది. లెయువా పటేళ్లు.. ప్రధానంగా గుజరాత్‌లో నివసిస్తున్న పాటిదార్ కమ్యూనిటీకి చెందిన ఉప-కులం. పటేల్ కమ్యూనిటీ ఓటు అత్యంత ప్రభావవంతమైనది. ఈ కమ్యూనిటీ ఓటుపైనే అక్కడి సీట్ల భవితవ్యం ఆధారపడి ఉంటుంది. అందుకే కాంగ్రెస్, బీజేపీ, ఆప్ పార్టీలు ఎక్కువగా పటేల్ కమ్యూనిటీపైనే దృష్టిపెట్టాయి.

గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, హార్దిక్ పటేల్.. కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పాటిదార్ నేత నరేష్ పటేల్‌ను పార్టీ అవమానించిందని ఆరోపించారు. 2017 ఎన్నికల్లో పాటిదార్ కాంగ్రెస్‌కు మంచి విజయాన్ని అందించాడు. అదే పాటిదార్లను, ఖోడల్ధామ్ ట్రస్ట్ అధ్యక్షుడు నరేష్ పటేల్‌ను కాంగ్రెస్ అవమానిస్తోందని హార్దిక్ పటేల్ విమర్శించారు. గత రెండేళ్లలో నరేష్ పటేల్ రాజకీయాల్లోకి చేరుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. న‌రేష్ ప‌టేల్ సోనియా గాంధీతో సమావేశం నేపథ్యంలో ఆయన త‌ర్వ‌లోనే కాంగ్రెస్‌లో చేరుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది చివరిలో గుజరాత్ 182 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగున్నాయి.
Read Also : Gujarat Election : కాంగ్రెస్‌‌తో పీకే ? మోదీ ఇలాఖాలో గాంధీ పార్టీని నిలబెడుతారా ?