రెచ్చిపోయిన ఉగ్రవాదులు : పౌరులు బందీ, ఆర్మీ కాన్వాయ్ పై దాడి

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు అలజడి రేపుతున్నారు. ఉగ్రదాడులు, ఎన్ కౌంటర్లతో జమ్ముకశ్మీర్ లో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. మూడు వేర్వేరు ప్రాంతాల్లో భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు

  • Published By: veegamteam ,Published On : September 28, 2019 / 10:50 AM IST
రెచ్చిపోయిన ఉగ్రవాదులు : పౌరులు బందీ, ఆర్మీ కాన్వాయ్ పై దాడి

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు అలజడి రేపుతున్నారు. ఉగ్రదాడులు, ఎన్ కౌంటర్లతో జమ్ముకశ్మీర్ లో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. మూడు వేర్వేరు ప్రాంతాల్లో భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు అలజడి రేపుతున్నారు. ఉగ్రదాడులు, ఎన్ కౌంటర్లతో జమ్ముకశ్మీర్ లో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. మూడు వేర్వేరు ప్రాంతాల్లో భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. శ్రీనగర్ లో ఆర్మీ కాన్వాయ్ పై ఉగ్రవాదుల గ్రనేడ్ దాడి చేశారు. ఈ దాడి నుంచి జవాన్లు తృటిలో తప్పించుకున్నారు. జమ్మూ-కిష్టావర్ జాతీయ రహదారిపై ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. గాందర్‌బల్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో ఆర్మీ బలగాలు తనిఖీలు నిర్వహించగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. భద్రతా బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనా స్థలం నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

రామ్‌బన్‌ జిల్లాలో బటోత్-దోడా జాతీయ రహదారిపై ఓ వ్యక్తిని ఉగ్రవాదులు బంధించారు. అయితే భద్రతా బలగాలు ఆ వ్యక్తిని వారి చెర నుంచి విడిపించాయి. ఉగ్రవాదులు విజయ్‌కుమార్‌ అనే ఓ వ్యక్తి ఇంట్లోకి దూరారు. ఉగ్రవాదులు చొరబడ్డ సమయంలో వారి కుటుంబ సభ్యులెవరూ ఇంట్లో లేరు. ఆ ఇంట్లో నక్కి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా రహదారులపై వాహనాల రాకపోకలను భద్రతా బలగాలు నిలిపివేశాయి. శ్రీనగర్‌లోని డౌన్‌టౌన్‌లో గ్రెనేడ్‌తో దాడి చేశారు. 

బటోత్ ప్రాంతంలో జమ్ము-కిష్టావర్ జాతీయ రహదారిపై ఉగ్రవాదులు బస్సును ఆపేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన డ్రైవర్‌ బస్సును ఆపకుండా తీసుకెళ్లడంతో పెనుముప్పు తప్పింది. బస్సు డ్రైవర్‌ సమీపంలోని ఆర్మీ అధికారులకు ఈ సమాచారం అందించాడు. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఉలికిపాటుతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. శ్రీనగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు.