ఆసుపత్రిలో గొడవ పడి..ట్రక్‌తో వీరంగం, వైరల్ వీడియో

ఆసుపత్రిలో గొడవ పడి..ట్రక్‌తో వీరంగం, వైరల్ వీడియో

Gurugram man rams truck inside hospital : ఎవరైనా తమకు సంబంధించిన వ్యక్తులకు న్యాయం జరగకపోతే..నిరసనలు, ఆందోళనలు చేస్తుంటారనే సంగతి వింటుంటాం. కానీ..ఓ వ్యక్తి ఆసుపత్రి వారితో గొడవపడి..ఓ ట్రక్కుతో వీరంగం సృష్టించాడు. వెనకకు..ముందుకు తిప్పుతూ..బీభత్సం చేశాడు. వాహనాలను ఢీ కొడుతూ..జనాలపైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనలు గురయ్యారు. ఘటనకు సంబంధించి దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. హర్యాణా రాష్ట్రంలోని గుర్‌గ్రామ్‌ (Gurugram)లో ఈ ఘటన చోటు చేసుకుంది.

బసాయి చౌక్ బాలాజీ ఆసుపత్రి వద్ద..పికప్ అప్ ట్రక్ (pick-up truck) వాహనంతో ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. ట్రక్‌తో వేగంగా ముందుకు..వెనుకకు నడపంతో చాలా మంది గాయపడ్డారు. అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆ వ్యక్తికి సంబంధించిన కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్సకు సంబంధించి ఆసుపత్రి సిబ్బందితో గొడవపడినట్లు సమాచారం. కనీసం 7 నుంచి 8 సార్లు వాహనాన్ని ఇష్టమొచ్చినట్లు నడిపించాడని, మెడికల్ స్టోర్ తో పాటు 10 నుంచి 15 వాహనాలు దెబ్బతిన్నాయని దీంతో తాము పోలీసులను పిలిచామని Balaji Hospital Director Dr Balwan Singh వెల్లడించారు.