Gurugram: కోవిడ్ భయంతో మూడేళ్లుగా ఇంటి నుంచి బయటకు రాని తల్లీకొడుకు.. మూడేళ్లుగా ఎలా ఉన్నారంటే

కోవిడ్ భయంతో రెండు, మూడేళ్లుగా ఇంటి నుంచి బయటకు రాని వ్యక్తులకు సంబంధించిన ఉదంతాలు అప్పుడప్పుడూ బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఒక ఘటన వెలుగు చూసింది. ఒక తల్లి, ఆమె పదేళ్ల కొడుకు మూడేళ్ల నుంచి కోవిడ్ భయంతో ఇంట్లోని ఒకే గదిలో ఉండిపోయారు. మూడేళ్లుగా ఆ గది నుంచి బయటకు రాలేదు.

Gurugram: కోవిడ్ భయంతో మూడేళ్లుగా ఇంటి నుంచి బయటకు రాని తల్లీకొడుకు.. మూడేళ్లుగా ఎలా ఉన్నారంటే

Gurugram: మూడేళ్ల క్రితం మొదలైన కోవిడ్ భయం కొందరిలో ఇంకా పోలేదు. 2020లో కోవిడ్ మొదలైనప్పుడు అందరిలోనూ ఏదో భయం. అయితే, కాలక్రమేణా ఆ భయం నుంచి, కోవిడ్ వ్యాధి నుంచి దాదాపు అందరూ బయటపడ్డారు. కానీ, కొంతమంది మాత్రం ఇంకా కోవిడ్ గురించి లేనిపోని భయాలతో బతుకుతూనే ఉన్నారు.

Delhi New Mayor: ఢిల్లీ మేయర్‌పై దాడికి బీజేపీ యత్నం.. మున్సిపాలిటీ సమావేశం రసాభాస.. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఆప్, బీజేపీ

కోవిడ్ భయంతో రెండు, మూడేళ్లుగా ఇంటి నుంచి బయటకు రాని వ్యక్తులకు సంబంధించిన ఉదంతాలు అప్పుడప్పుడూ బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఒక ఘటన వెలుగు చూసింది. ఒక తల్లి, ఆమె పదేళ్ల కొడుకు మూడేళ్ల నుంచి కోవిడ్ భయంతో ఇంట్లోనే ఉండిపోయారు. మూడేళ్లుగా ఆ ఇంటి నుంచి బయటకు రాలేదు. ఈ ఘటన గురుగ్రామ్, చక్కర్‌పూర్‌లో జరిగింది. మున్మున్ మాంఝి అనే మహిళ 2020లో కోవిడ్ వ్యాప్తి మొదలైన సమయంలో తన కొడుకుతో పాటు ఇంట్లోనే ఉండిపోయింది. బయటకు వచ్చినా, ఎవరినైనా కలిసినా కోవిడ్ సోకుతుందేమోనని భయపడింది.

IND vs AUS ODI Series: మాక్స్‌వెల్, మిచెల్ వచ్చేస్తున్నారు.. ఇండియాతో వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా

అంతే.. ఆ భయంతో మూడేళ్లుగా తన కొడుకుతో పాటు అదే ఇంట్లో ఉండిపోయింది. బయటకు వచ్చేందుకు కూడా ఇష్టపడలేదు. ఆమె భర్త వారిని బయటకు తెచ్చేందుకు ఎంతగా ప్రయత్నించినప్పటికీ, అది సాధ్యం కాలేదు. చివరకు ఇటీవల ఈ విషయాన్ని అతడు పోలీసులకు చెప్పాడు. తన భార్య, పదేళ్లు కొడుకు మూడేళ్లుగా కోవిడ్ కారణంగా ఇంట్లోనే ఉంటున్నారని, బయటకు రావడం లేదని చెప్పాడు. స్పందించిన పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు వాళ్ల ఇంటికి చేరుకున్నారు. తల్లీకొడుకును బయటకు తెచ్చేందుకు ప్రయత్నించారు.

Arkansas Plane Crashes: యూఎస్‌లో కూలిన ట్విన్ ఇంజిన్ విమానం.. ఐదుగురు దుర్మరణం

దీనికి వాళ్లు నిరాకరించారు. దీంతో తలుపులు పగలగొట్టి, వారిని బలవంతంగా బయటకు తెచ్చారు. ఇద్దరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, తల్లీకొడుకు గదిలో మూడేళ్లు ఎలా ఉన్నారో తెలిసి అందరూ షాకయ్యారు. వాళ్లు ఇంతకాలం ఇంటిలోనే వండుకున్నారు. గ్యాస్ స్టవ్ బదులు, ఇండక్షన్ స్టవ్ వాడేవాళ్లు. లోపలి చెత్తను కూడా బయటకు పడేయలేదు. దీంతో ఇల్లంతా చెత్త, దుర్వాసనతో నిండిపోయింది. నిత్యావసరాలు, ఫుడ్ ప్యాకెట్ల ర్యాపర్స్ వంటివి చిందరవందరగా కనిపించాయి. మూడేళ్లలో ఆ తల్లి తనతోపాటు తన కొడుకుకు హెయిర్ కట్ చేసింది. పదేళ్ల బాలుడు కాలక్షేపం కోసం గదిలో గోడలపై పెయింటింగ్ చేసేవాడు. పెన్సిళ్లతో ఏదో చదువుకునేందుకు ప్రయత్నించాడు.

మూడేళ్లలో ఆ బాలుడికి ఒక్కసారి కూడా ఎండ తగల్లేదంటే అతడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మూడేళ్లలో వాళ్లింటిని ఎవరూ సందర్శించలేదు. కోవిడ్ సమయంలో నిబంధనల కారణంగా మహిళ భర్త వేరే చోట ఉండాల్సి వచ్చింది. దీంతో అతడిని కూడా తర్వాత ఆమె ఇంట్లోకి రానివ్వలేదు. వీడియో కాల్స్ ద్వారా మాత్రమే మాట్లాడుకునేవాళ్లు. మహిళ భర్తే ఇంటి రెంట్ కట్టేవాడు. ఎలక్ట్రిసిటీ బిల్ చెల్లించేవాడు. బయటి నుంచి సరుకులు తెచ్చి, మెయిన్ డోర్ దగ్గరే వదిలేసేవాడు. వీటితోనే ఆ తల్లీ కొడుకు బతికారు.