GVL Tobacco Board : టొబాకో బోర్డు మెంబర్‌గా ఎంపీ జీవీఎల్ నియామకం

బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు టొబాకో బోర్డు మెంబర్ గా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని జీవీఎల్ స్వయంగా వెల్లడించారు.

GVL Tobacco Board : టొబాకో బోర్డు మెంబర్‌గా ఎంపీ జీవీఎల్ నియామకం

Gvl

GVL Tobacco Board : బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు టొబాకో బోర్డు మెంబర్ గా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని జీవీఎల్ స్వయంగా వెల్లడించారు. టొబాకో బోర్డు చట్టం 1975 ప్రకారం బోర్డులో ఒక రాజ్యసభ సభ్యుడు కూడా ఉండాలని, ఆ విధంగా టొబాకో బోర్డులో రాజ్యసభ నుంచి తాను ప్రాతినిధ్యం వహిస్తున్నానని వివరించారు.

Covid 3rd Wave : పిల్లలపైనే ఒమిక్రాన్ ప్రభావం ఎక్కువ.. ఎందుకంటే? నిపుణుల మాటల్లోనే..!

ఇకపై పొగాకు సాగు చేసే రైతుల ప్రయోజనాల కోసం కృషి చేస్తానని, పొగాకు ఎగుమతులు పెరిగేందుకు సహకారం అందిస్తానని జీవీఎల్ చెప్పారు. జీవీఎల్ నియామకంపై రాజ్యసభ సెక్రటేరియట్ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఇప్పటికే మిర్చి జాతీయ టాస్క్ ఫోర్స్ చైర్మన్ గా జీవీఎల్ కొనసాగుతున్నారు. గతంలో రాజ్యసభ ద్వారా సుగంధ ద్రవ్యాల బోర్డు సభ్యునిగా కూడా జీవీఎల్ ఎన్నికయ్యారు.

Online Shopping : షాకింగ్.. రూ.16వేల ఫోన్ ఆర్డర్ చేస్తే.. అరకిలో రాయి వచ్చింది

పొగాకు బోర్డు చట్టం 1975లోని సెక్షన్ 4(4) (బి) ప్రకారం, పొగాకు బోర్డ్ రూల్స్, 1976లోని రూల్ 4(1) ప్రకారం, పొగాకు బోర్డు సభ్యునిగా ఒక రాజ్యసభ సభ్యుడిని హౌస్ సభ్యుల నుండి ఎన్నుకుంటారు. అదే నిబంధన ప్రకారం, ఇద్దరు లోక్‌సభ సభ్యులు పొగాకు బోర్డుకు కొంత కాలం కిందట ఎన్నికయ్యారు. ప్రస్తుతం బండి సంజయ్ (తెలంగాణ), బాలశౌరి (ఏపీ) లోక్‌సభ నుండి పొగాకు బోర్డు పార్లమెంట్ ప్రతినిధులుగా ఉన్నారు.