Aadhaar To Eat Golgappa : ఆధార్ కార్డు చూపిస్తేనే పానీ పూరి..! వ్యాపారి వింత రూల్..!!

ఆధార్ కార్డు ఉంటేనే పెన్షన్లు ఇస్తారు.అన్నింటికీ ఆధారే ఆధారం అన్నట్లుగా మారిపోయింది. కానీ పానీపూరీ తినటానికి కూడా ఆధార్ కార్డు ఉండాలా? అంటే ఉండాల్సిందేనంటున్నాడో ఓ పానీపూరీ బండి యజమాని ‘ఛోటే లాల్ బఘేల్ భగత్ జీ’.. ఆధార్ కార్డు చూపిస్తేనే పానీపూరి అమ్ముతాడు అతను. లేదంటే అమ్మేదే లేదు అంటున్నాడు. ఎందుకంటే..

Aadhaar To Eat Golgappa : ఆధార్ కార్డు చూపిస్తేనే పానీ పూరి..! వ్యాపారి వింత రూల్..!!

Aadhaar To Eat Golgappa

Aadhaar To Eat Golgappa : ఆధార్ కార్డు ఉంటేనే పెన్షన్ ఇస్తుంది ప్రభుత్వం. స్కాలర్ ఫిప్పులు రావాలన్నా..దేనికైనా సరే అన్నింటికీ ఆధారే ఆధారం అన్నట్లుగా మారిపోయింది. కానీ పానీపూరీ తినటానికి కూడా ఆధార్ కార్డు ఉండాలా? అంటే ఉండాల్సిందేనంటున్నాడో ఓ పానీపూరీ బండి యజమాని ‘ఛోటే లాల్ బఘేల్ భగత్ జీ’.. ఆధార్ కార్డు చూపిస్తేనే పానీపూరి అమ్ముతాడు అతను. లేదంటే అమ్మేదే లేదు అంటున్నాడు. అదేంటీ పానీపూరీ తినాలంటే ఆధార్ కార్డు చూపించాలా? ఇది మరీ విడ్డూరంగా ఉందే అనిపిస్తోంది కదూ..కానీ దానికికూడా ఓ కారణం ఉంది. దీనికి కారణం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్-భింద్ రహదారిలో ఓ పానీపూరీ బండి ఉంది. ఆ బండి వద్ద పానీపూరీ తినాలంటే బండిగల వ్యక్తికి మీ ఆధార్ కార్డు చూపించాలి. ఎందుకంటే ఇక్కడ పిల్లలకు, మహిళలకు, వృద్ధులకు గొల్గప్పలు అమ్మరు. 18 నుంచి 50 ఏళ్లలోపు వారికి మాత్రమే ఇక్కడ పానీపూరీలు అమ్ముతారు.

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్-భింద్ రహదారిలో ఛోటే లాల్ బఘేల్ భగత్ జీ గోల్గప్ప స్టాల్ (పానీపూరి బండి)నిర్వహిస్తున్నాడు. భగత్ జీ పానీపూరీ అంటే అంటే అక్కడ ఫుల్ ఫేమస్. ఆ రుచి చూసి తీరాల్సిందేనంటారుస్థానికులు.దీంతో భగత్ జీ పానీపూరి స్టాల్ వద్ద ఎప్పుడు మాంచీ గిరాకీ ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా భగత్ జీ పానీపూరి రుచి ఆధార్ కార్డు ఉంటేనే పానీ పూరీ అనే పోస్టులు చూసినవారు ఇదేదో భలేగుందే ఒక్కసారి టేస్ట్ చూద్దాం అనుకుంటారు. దీంతో ఇతని పానీపూరి రుచి కోసం స్థానికులే కాకుండా ఇతర నగరాల నుంచి కూడా ఇక్కడికొస్తుంటారు చాలామంది. విత్ ఆధార్ కార్డుతో..

అయితే ఇక్కడ 18 నుంచి 50 ఏళ్లలోపు వారికి మాత్రమే పానీపూరి అమ్ముతారు భగత్ జీ. ఇక్కడ పిల్లలు, మహిళలు, వృద్ధులకు పానీపూరీ అమ్మరు. అంటూ ఛోటే లాల్ బాఘేల్ బోర్డు రాసి మరీ పెట్టాడు. దీంతో ఆధార్ తప్పనిసరికూడా చేశాడు.ఈ ఆధార్ కార్డు నిబంధన గురించి ఛోటే లాల్ మాట్లాడుతూ..తాను తయారుచేసిన మసాలా కాస్త ఘాటుగా ఉంటుందని..ఈ ఘాటును అందరు భరించలేరని అందుకే మహిళలు, చిన్నారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పానీపూరి తినిపించరని చెప్పుకొచ్చాడు. గర్భిణీలు తాను తయారు చేసే గొల్గప్పలను అస్సలు తినకూడదని స్పష్టంగా చెప్పుకొచ్చాడు. వారికి ఇబ్బంది కలుగకూడదని ఇటువంటి నిబంధన పెట్టాలని చెప్పుకొచ్చాడు.

కానీ అతను వాడే మసాలు ఏంటో చెప్పడు. ఎందుకంటే అది వ్యాపార రహస్యం అంటాడు. అంతేగా మరి..ఎవరి వ్యాపార రహస్యాలు ఎవ్వరు చెప్పరు. తాను 20 ఏళ్లుగా ఈ పానీపూరీ వ్యాపారం చేస్తున్నానని ఇది కేవలం వ్యాపారమే కాదు నా బండి వద్ద పానీపూరీ తిన్న వారు ఎంతో ప్రేమగా చాలా బాగుంది అంటూ తనపై ప్రేమ చూపిస్తారని అది తనకు ఎంతో ఆనందాన్నిస్తుందని చెప్పుకొచ్చాడు ఛోటే లాల్. ఎంతో దూరంనుంచి నా గొల్లగప్పలు తినడానికి నా దగ్గరకు వస్తారు..వారంతా నా అభిమానులే అని నా అభిమానులను తన రుచిద్వారా తృప్తి పరచటం అంటే తనకు ఎంతో ఇష్టమంటాడు. అలా నా పానీపూరి రుచి కోసం వచ్చేవారిని ఆనందంగా పంపించాలి తప్ప ఇబ్బందిగా పంపించకూడదని అందుకే పిల్లలకు,పెద్దవారికి,మహిళలకు నేను పానీ పూరీ అమ్మనని స్పష్టంగా చెప్పుకొచ్చాడీ గోల్గప్ప వ్యాపారి ‘ఛోటే లాల్ బఘేల్ భగత్ జీ’..