Football with Sarees : ‘ గోల్ ఇన్ శారీ’.. గ్వాలియర్ మహిళలా? మజాకా!

ఆడవారు చీరకట్టులో ర్యాంప్ వాక్ లు చేయగలరు.. పరుగులు తీయగలరు.. ఫుట్ బాల్ మ్యాచ్ లు ఆడగలరు. గ్వాలియర్ లో "గోల్ ఇన్ శారీ" పేరుతో జరిగిన ఫుట్ బాల్ మ్యాచ్ ఇందుకు నిదర్శనం. ఫుట్ బాల్ గ్రౌండ్ లో గోల్స్ కొడుతూ పరుగులు తీసిన ఈ మహిళల మ్యాచ్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Football with Sarees : ‘ గోల్ ఇన్ శారీ’.. గ్వాలియర్ మహిళలా? మజాకా!

Gwalior women playing Football wearing Sarees

Football with Sarees : సాధారణంగా మహిళలు చీర కట్టుకుంటే కాస్త స్పీడ్ గా నడవడానికి, పరుగు పెట్టడానికి ఇబ్బంది పడతారు. అలాంటిది చీరతో ఫుడ్ బాల్ (Football) ఆడటం ఈజీనా? ఎంతో సులభం అని ఆడి చూపించారు గ్వాలియర్ మహిళలు (Gwalior women). “గోల్ ఇన్ శారీ” (Goal in Saree) పేరుతో గ్వాలియర్ లో జరిగిన మహిళల ఫుట్ బాల్ మ్యాచ్ ఆద్యంతం అందర్నీ అలరించింది.

Namo App New Feature : మోడీతో దిగిన ఫోటో మిస్ అయ్యిందా? నమో యాప్‌లో దొరికేస్తుంది

విదేశాలతో పోలిస్తే మన దేశంలో ఫుట్ బాల్ కి కాస్త ఆదరణ తక్కువే అని చెప్పాలి. అందులోనూ మగవారే ఎక్కువగా ఫుట్ బాల్ ఆడటం మనం చూస్తుంటాం. అలాంటిది గ్వాలియర్ లో ఆడవారు ఛీరలు ధరించి ఫుట్ బాల్ మ్యాచ్ ఆడటం అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. వారంతా వైబ్రెంట్ శారీస్ ధరించి గ్రౌండ్ లో పరుగులు తీస్తూ గోల్స్ కొడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వారి ఆటతీరుతో గ్రౌండ్ మొత్తం ఉత్సాహ భరితంగా మారిపోయింది. మహిళలు పరుగులు పెడుతూ ఫుట్ బాల్ ఆడుతుంటే స్టేడియం మొత్తం ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో దద్దరిల్లిపోయింది. ఈవెంట్ కన్వనర్ అంజలీ బంత్రా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పింక్ , ఆరెంజ్ కలర్ చీరలు ధరించిన టీమ్స్ పోటీ పడ్డాయి. మొదటి మ్యాచ్ ని పింక్ పాంథర్ టీమ్ (Pink Panther team) గెలుపొందగా రెండవ మ్యాచ్ ను బ్లూ క్లీన్ టీం (Blue Clean team) కైవసం చేసుకుంది. ఇక ఈ ఆటను 25 నుంచి 50 ఏళ్ల వయసున్న మహిళలు పోటీ పడి ఆడటం విశేషం.

Viral Video: చాక్లెట్ల జడతో అలంకరించుకున్న పెళ్లి కూతురు.. చాక్లెట్లతోనే నగలు.. వైరల్ అవుతున్న వీడియో

ఆడవారి సంప్రదాయ వస్త్రాల్లో చీరదే అగ్రస్థానం. అందమైన చీరలు ధరించి వంట చేయగలరు.. ఉద్యోగాలు చేయగలరు.. పరుగులు పెడుతూ ఫుట్ బాల్ కూడా ఆడగలరు.. పట్టుదల ఉంటే తమకేది అడ్డంకి కాదని నిరూపిస్తూ ఫుట్ బాల్ గ్రౌండ్ లో పరుగులు తీసిన ఈ మహిళలు మరెందరో ఆడవారిలో స్ఫూర్తి నింపుతున్నారు.